For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Allu Aravind: గీతా ఆర్ట్స్ లో బోయపాటి సినిమా.. అనౌన్స్ చేసి సస్పెన్స్.. అందరి దృష్టి దాని మీదే?

  |

  బోయపాటి శ్రీను గీతా ఆర్ట్స్ లో మరో సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు అల్లు అరవింద్. ఈరోజు 'ఆహా'లో ఎన్బీకే అన్ స్టాపబుల్ షోకి సంబందించిన ప్రోమోను హైదరాబాద్ లో గ్రాండ్ గా లంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అరవింద్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

  ఆహా అన్ స్టాపబుల్ 'విత్ ఎన్బీకే'

  ఆహా అన్ స్టాపబుల్ 'విత్ ఎన్బీకే'

  నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేస్తున్న టాక్ షో ఆహా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. 'ఆహా'లో నవంబర్ నాలుగు నుంచి ప్రసారం కానున్న ఈ షో కోసం నందమూరి అభిమానులు సహా సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు దసరా సందర్భంగా ఈ షోను గ్రాండ్ గా లాంచ్ చేశారు.

  జీవిస్తూ ఉంటారు

  జీవిస్తూ ఉంటారు


  ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్ మాట్లాడుతూ "బాలకృష్ణ తెరపైనే గొప్ప నటుడు... బయట ఆయన జీవిస్తూ ఉంటారని అన్నారు. ఆయనకు కోపం వస్తే కోపం, సంతోషం వస్తే సంతోషం.. ఏదొస్తే అది నటించకుండా చూపించే మనస్తత్వం ఆయనది అంటూ ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. రియల్ ఎమోషన్స్ ను చూపించగల మనుషులు ఈ టాక్ షో చేస్తే ఎలా ఉంటుందో ? మీరు ఊహించుకోవచ్చని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

  మరో రేంజ్ లో

  మరో రేంజ్ లో

  ఎదుటి వ్యక్తి నుంచి ఏం తీసుకోవచ్చు ? వాళ్ళతో ఏం చెప్పిస్తే షోను రక్తి కట్టించొచ్చు ? అనే విషయాలు బాలకృష్ణకు బాగా తెలుసని అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఆయన ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారో మనకు తెలుసు... కాకపోతే ఇంకా కుర్రోడిలా కన్పిస్తున్నారన్న అరవింద్ ఆయన అనుభవం అంతా ఈ షోలో పెడితే మరో రేంజ్ లో ఉండనుందని వెల్లడించారు.

  కెవ్వు మన్నారు

  కెవ్వు మన్నారు

  ఇక బాలయ్యతో కలిసి షో చేస్తే ఎలా ఉంటుంది? అని నేను ఆఫీస్ లో అడిగితే నా స్టాఫ్ అంతా కెవ్వుమని అరిచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారని అన్నారు. అంత బాగుంటుందని వాళ్ళు ఎగ్జైట్ అయ్యారని అన్నారు. ఇక ఈ షోతో పాటు 'అఖండ' కూడా అఖండమైన సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నానని, అంటూ బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు అల్లు అరవింద్.

  అంతకంతకూ ఆలస్యం

  అంతకంతకూ ఆలస్యం


  ఇక బోయపాటి గురించి మాట్లాడుతూ ఇప్పటికే మాతో ఒక సినిమా చేశాడని మరో సినిమాకు సిద్ధం అవుతున్నామని చెప్పుకొచ్చారు. వినయ విధేయ రామ సినిమా దారుణంగా ప్లాప్ అయిన త‌ర్వాత త‌మ బ్యానర్‌లో బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని అల్లు అరవింద్ గతంలో ఒక ఈవెంట్ లో ప్రకటించారు. ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సింది అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అనుకోని కార‌ణాల‌తో ఆల‌స్యం అవుతూ వ‌చ్చింద‌ని చెప్పారు.

  Pooja Hegde, Akhil Akkineni Interview | Most Eligible Bachelor
  హీరో ఎవ‌రు?

  హీరో ఎవ‌రు?

  అయితే ఇందులో హీరో ఎవ‌ర‌నే విష‌యంపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. త‌మ సంస్థ‌కు ఇప్ప‌టికే ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన బోయ‌పాటి.. మ‌రో హిట్ ఇవ్వ‌బోతున్నాడ‌ని అల్లు అరవింద్ అయితే ధీమాగానే ఉన్నారు. అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా చేయగా అది సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మరో సినిమా ఎవరితో అనే దాని మీద మాత్రం క్లారిటీ మిస్ అవుతుంది. చూడాలి ఫైనల్ గా ఎవరితో మొదలు కాబోతుంది అనేది.

  English summary
  In the launch event of aha's unstoppable with NBK, Allu Aravind hints boyapati srinu movie with Geetha arts.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X