»   » గుంటూరు లో స్థలాలు పరిశీలించిన అల్లు అరవింద్‌, రీజన్ ఇదే, భారీ స్కెచ్చే

గుంటూరు లో స్థలాలు పరిశీలించిన అల్లు అరవింద్‌, రీజన్ ఇదే, భారీ స్కెచ్చే

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయంలోని స్థలాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ..గురువారం సందర్శించటంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది. అంత పెద్ద నిర్మాత ఏదన్నా షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చారా అనే చర్చ నడిచింది. లేదు చిరంజీవి 150 వ చిత్రం షూటింగ్ చేస్తారు అని చెప్పుకున్నారు. అదేమి కాదు అని తేలింది.

అల్లు అరవింద్ రంగంలోకి దిగారు. తనదైన శైలిలో భారీ స్కెచ్ వేస్తున్నారు. చిరంజీవి, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ఖైదీ నెంబర్ 150. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. మరో ప్రక్క ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం అల్లు అరవింద్ పనులన్ని భుజాన వేసుకుని రంగంలోకి దిగారు.


కె ఎల్ యూనివర్శిటీ ప్రాగణంలోనే రామ్ గోపాల్ వర్మ, వంగవీటి ఆడియో జరిగింది. స్టార్ ఎట్రాక్షన్ ఎవరూ లేకపోయినా కేవలం వర్మను చూడటానికే దాదాపు యాభై వేల మంది జనం వచ్చారు. దాంతో ఇదే ప్లేస్ అయితే ఖైదీ నెంబర్ 150ఆడియో కు బాగుంటుందని అల్లు అరవింద్ నిర్దారణకు వచ్చారంటున్నారు.


వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్‌ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. తరుణ్‌ అరోరా ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు.


ప్రజల ఆశీస్సుల కోసమే

ప్రజల ఆశీస్సుల కోసమే

చిరంజీవి మళ్లీ చాలా కాలం తర్వాత వస్తున్నారని ఇన్నేళ్లుగా ఆశీర్వదించిన ప్రజల ఆశీస్సులు మళ్లీ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆడియో ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డులో చేస్తే బాగుంటుందని భావిస్తున్నామని తెలిపారు.


ఈ నెలలోనే..

ఈ నెలలోనే..

కృష్ణాతీరంలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్‌ 150 చిత్రం ఆడియో ఆవిష్కరణ ఈనెలలో నిర్వహించాలని నిర్ణయించామని ఇందులో భాగంగానే కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయంలోని స్థలాన్ని పరిశీలించినట్లు ప్రముఖ సినీ నిర్మాత అల్లుఅరవింద్‌ తెలిపారు.


మరో రెండు ప్రాంతాలు కూడా

మరో రెండు ప్రాంతాలు కూడా

ఇందుకోసం కేఎల్‌ విశ్వవిద్యాలయం స్థలం చూశామని అన్నారు. దీనితో పాటు మరో రెండు ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. కేఎల్‌ విశ్వవిద్యాలయంలో ఆడియో ఆవిష్కరణ ఏర్పాటు చేసే పక్షంలో వాహనాల పార్కింగ్‌ ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపైనా చర్చించారు.


ఏ ఇబ్బంది పడకుండా..

ఏ ఇబ్బంది పడకుండా..

భారీగా తరలి వచ్చే చిరంజీవి అభిమానులకు సరిపడినంత ప్రదేశాన్ని ఎంపిక చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండేలా, అభిమానులు ఆనందపడేలా , విశాలంగా ఉండే స్దలం కావాలని పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు అల్లు అరవింద్.


నెట్ ప్రాక్టీస్ ...

నెట్ ప్రాక్టీస్ ...

చిరంజీవి, చరణ్‌, మిగతా సభ్యులతో చర్చించి ఎక్కడ ఆవిష్కరించాలి? ఎలా చేయాలి? అనే నిర్ణయానికి ముందు నెట్‌ ప్రాక్టీస్‌ కింద ఇవన్నీ చూస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై త్వరగానే డెషిషన్ తీసుకుని , మిగతా ఏర్పాట్లుకు రంగం సిద్దం చేస్తామని అన్నారు అరవింద్.


ఆశ్వీరదించండి

ఆశ్వీరదించండి

ఖైదీ నంబర్‌ 150 సినిమా గురించి ఎంతచెప్పినా.. నేను చెబితే మీకు తక్కువుగా ఉంటుందని తెలిపారు. ఆడియో వేడుకలో సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను మచ్చుతునకగా చూపాలని అనుకుంటున్నామన్నారు. అవన్నీ చూసి ఆనందపడి చిరంజీవిని ఆశీర్వదించి పంపాలని కోరుకుంటున్నానన్నారు.


సాదర స్వాగతం

సాదర స్వాగతం

తొలుత కేఎల్‌యూ ఉప కులపతి డాక్టర్‌ ఎల్‌ఎస్‌ఎస్‌రెడ్డి, ప్రొ వైస్‌ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఏవీఎస్‌ ప్రసాద్‌, పలువురు ఆచార్యులు అల్లు అరవింద్‌కు సాదరంగా స్వాగతం పలికారు. కృష్ణా జిల్లా ఫెర్రి, తాత్కాలిక సచివాలయం వద్ద, మంగళగిరి హాయ్‌ల్యాండ్‌ను పరిశీలించారు. సినీ వర్గాలు మాత్రం దాదాపుగా యూనివర్సిటీనే ఖాయం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.


ఎమ్మల్యే కుమారుడి పెళ్లి జరిగిన చోట

ఎమ్మల్యే కుమారుడి పెళ్లి జరిగిన చోట

మంగళగిరి మండలం చినకాకానిలోని స్థలాలను అల్లుఅరవింద్‌ గురువారం పరిశీలించారు. ఇటీవల గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుమారుడి వివాహం జరిగిన స్థలాన్ని, హాయ్‌ల్యాండ్‌కు సంబంధించిన మరో స్థలాన్ని పరిశీలించారు. హాయ్‌ల్యాండ్‌లో విడిది గదులను కూడా పరిశీలించారు.


ప్రస్తుతం చిత్రం షూటింగ్

ప్రస్తుతం చిత్రం షూటింగ్

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న 'ఖైదీ నంబరు 150' చిత్రం షూటింగ్‌ వేగంగానే కాదు సరదా సరదాగా జరుగుతోంది. ఈ చిత్రంలోని పాటల షూటింగ్‌ రీసెంట్ గా స్లోవేనియా, క్రొయేషియాలో జరుగింది. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది. చిత్రం కాస్టూమ్స్‌ డిజైనర్‌, చిరు కుమార్తె సుస్మిత, హీరోయిన్ కాజల్‌ తమ ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ అబిమానులకు ఆనందం కలిగిస్తున్నారు.


రీమేక్ తోనే హిట్

రీమేక్ తోనే హిట్

మెగాస్టార్ రీ ఎంట్రీకి భారీగా ప్లాన్ చేసి రూపొందింస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ సూపర్ హిట్ చిత్రం కత్తి ఆధారంగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి చిత్రానికి కూడా ‘కత్తిలాంటోడు' టైటిల్‌ పెట్టాలని చిత్రబృందం నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. అయితే అభిమానుల కోరిక మేరకు ఖైదీ నెంబర్ 150 అని మార్చారు.


అందుకే ఆ టైటిల్

అందుకే ఆ టైటిల్

చిరంజీవికి ఇది 150వ చిత్రం కావడం, చిరు కెరీర్‌లో ఖైదీ, ఖైదీ నంబరు 786 చిత్రాలు ఘన విజయం సాధించడం, ఈ నూతన చిత్రంలో ఖైదీ నంబరు 150 కావడంతో ఈ చిత్రానికి ‘ఖైదీ నంబరు 150' అని పెట్టాలని చిత్ర యూనిట్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


సంక్రాంతి కానుక

2017 సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఫై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.


English summary
Allu Aravind Visited KL University grounds. The same venue has been chosen for Khaidi No 150 and the audio release is on December 25.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu