పవన్.. వర్మను శిక్షిస్తావో.. క్షమిస్తావో నీ ఇష్టం.. ఆ నీచుడు ఏమైనా చేస్తాడు.. అల్లు అరవింద్

By Rajababu

Recommended Video

Allu Aravind Fires On Ram Gopal Varma

పవన్ కల్యాణ్‌ను తనతో ప్రముఖ దర్శకుడు వర్మ తిట్టించారని నటి శ్రీరెడ్డి వెల్లడించిన అంశం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌ను నేనే తిట్టించానని వర్మ వీడియో రిలీజ్ చేయడంతో అసలు బండారం బయటపడింది. వర్మ వ్యవహారంపై స్పందించడానికి నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మెగా కుటుంబంతో ఉన్న విభేదాల వల్లే వర్మ ఇలాంటి నీచపు పనులకు పాల్పడుతున్నాడని అల్లు అరవింద్ ఫైర్ అయ్యాడు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్‌కు తగిన సూచనలు.. సలహాలను మీడియా ముఖంగా ఇచ్చారు.

 ఒంటరిగా పవన్ కల్యాణ్ ఉద్యమం

ఒంటరిగా పవన్ కల్యాణ్ ఉద్యమం

ప్రజల కోసం మంచి చెద్దామని జనసేన పార్టీతో పవన్ కల్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నంపై ఫ్యామిలీ నీడ పడుకుండా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఓ ఉద్యమం చేస్తున్నావు.

నీ ఉద్యమాన్ని గౌరవిస్తున్నాం

నీ ఉద్యమాన్ని గౌరవిస్తున్నాం

డియర్ పవన్ కల్యాణ్ మీ ఉద్యమాన్ని, పంథాను మేము గౌరవిస్తున్నాం. మేము పదేళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కాబట్టి నేను ఇలా స్పందించాల్సి వచ్చింది. నీకు అలాంటి పరిస్థితులు ఎదురుకావొద్దని మేము చర్యలు తీసుకొంటున్నాం.

రాంగోపాల్ వర్మ లాంటి నీచులు

రాంగోపాల్ వర్మ లాంటి నీచులు

నీపై అక్కసు గక్కుతూ వర్మ లాంటి నీచులు నీపై బురద జల్లుతున్నందున జాగ్రత్తగా ఉండాలని కుటుంబ సభ్యుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నీవు రాంగోపాల్ వర్మను శిక్షిస్తావో.. క్షమించి వదిలేస్తావో నీకే వదిలేస్తున్నాను. మీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో నాకు సంబంధం లేని విషయం. అది నీ అంతర్గత విషయం అని అల్లు అరవింద్ అన్నారు.

మీడియా తగిన విధంగా స్పందించాలి

మీడియా తగిన విధంగా స్పందించాలి

మా కుటుంబంపై వర్మ లాంటి నీచుడు ఇలా మాట్లాడనే భావోద్వేగంలో ఉన్నాను. మీడియా తగిన విధంగా స్పందించాలని అల్లు అరవింద్ వేడుకొన్నారు. సినీ పరిశ్రమను చిన్నబుచ్చే విధంగా చేసే కుట్రలకు దూరంగా ఉండాలి అని అల్లు అరవింద్ సూచించారు.

రాంగోల్ వర్మ లాంటి నీచుడు

రాంగోల్ వర్మ లాంటి నీచుడు

రాంగోపాల్ వర్మ లాంటి నీచుడు ఎలాంటి పనులైనా చేస్తాడు. ఆయన వెనుక ఉన్నది ఎవరన్నది నాకు తెలియదు. నాకు క్లారిటీ లేదు. కానీ చూచాయగా మాకు అర్ధమవుతున్నది. ఒకవేళ రాంగోపాల్ వర్మ వెనుక ఉందని ఎవరనే క్లియర్‌గా తెలిస్తే తప్పకుండా బహిర్గతం చేస్తాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X