»   » భార్యకి ఆ విషయంలో హెచ్చరించిన అల్లు అర్జున్

భార్యకి ఆ విషయంలో హెచ్చరించిన అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొత్త పెళ్ళి కొడుకు అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డికి తన కుటుంబం పరువు,ప్రతిష్టలు గురించి కొన్ని జాగ్రత్తలు చెప్తున్నట్లు సమాచారం. సెలబ్రేటిని అయిన తనని పెళ్ళి చేసుకున్న ఆమె కూడా సెలబ్రేటికీ మారినట్లే నని దాంతో తమ సంసారంపై అందరి కళ్ళూ ఉంటాయని,ముఖ్యంగా మీడియా చూపు తమపై ఉంటుందని ఆమెకు హిత భోధ చేసాట్ట. అందుకని ఆమె తన క్లోజ్ ప్రెండ్స్ అనుకున్న వారి దగ్గర కూడా పొరపాటున కూడా తమ కుటుంబానికి చెందిన ఏ విషయమూ లీక్ చెయ్యదని కోరాట్ట. ఎందుకంటే అది బయిట స్ప్రెడ్ అయి మీడియా దృష్టిలో పడి పెద్దదవుతుందని చెప్పాడని చెప్పుకుంటున్నారు. అంతేకాదు తమ కుటుంబానికి అనేకమంది రాజకీయ,సినిమా వ్యక్తులు వస్తూంటారు కాబట్టి ఆ విషయాలు ఏమీ పొరపాటున కూడా బయిటకు లీక్ కావటానకి వీల్లేదని చెప్పినట్లు సమాచారం. అలాగే ఎప్పడయినా మీడియా వారు కలిసినప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలని ప్రేమతో హెచ్చరిక చేసాడని సమాచారం. ఇది విన్న మిగతా సినీ పెద్దలు.. భాధ్యత గల కొడుకుగా అల్లు అర్జున్ ప్రవర్తిస్తున్న తీరు ముచ్చటేస్తోందని అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్..వివి వినాయిక్ కాంబినేషన్ లో బద్రీనాధ్ చిత్రం రూపొందుతోంది. ఆ తర్వాత అల్లు అర్జున్..త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం కానుంది.

English summary
Allu Arjun reportedly advised Sneha to be careful with her statements. This was more of a lovely but very concerned warning to Sneha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu