Don't Miss!
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- News
తారకరత్నను చూడగానే ఒక్క సారిగా జూ ఎన్టీఆర్ ..: తారక్ కోసం మంత్రిని పంపిన సీఎం..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
పదో వివాహా వార్షికోత్సవం.. ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ మహల్ వద్ద బన్నీ స్నేహా రచ్చ
టాలీవుడ్‌లో క్యూట్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా అల్లు అర్జున్ స్నేహా రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. నేటి ఈ వీరి వివాహా బంధానికి పదేళ్లు నిండాయి. ఈ క్రమంలో బన్నీ తన శ్రీమతికి స్పెషల్ సర్ ప్రైజ్‌ను ఇచ్చినట్టు కనిపిస్తోంది. పుష్ప షూటింగ్ పూర్తి అవ్వడంతో హైద్రాబాద్‌లో వాలిన బన్నీ.. ఇలా పెళ్లి రోజును మాత్రం గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేందుకు ప్లాన్ వేశాడు. బన్నీ ఆ మధ్య ఓ షోలో మాట్లాడుతూ తన ప్రేమ గురించి బయటపెట్టేశాడు.

అలా మొదటిసారిగా..
స్నేహారెడ్డిని మొదటిసారిగా చూసిన క్షణాలను, నాటి ఫీలింగ్స్‌ను బన్నీ పంచుకున్నాడు. సమంత ఆహా కోసం చేసిన సామ్ జామ్ షోలో బన్నీ తన ప్రేమ కథ గురించి చెప్పుకొచ్చాడు. మొదటిసారిగా పబ్‌లో స్నేహారెడ్డిని చూశానని, ఎంత రాత్రి అవుతున్నా కూడా.. చుట్టూ వాతావరణం ఎలా ఉన్నా కూడా ఆమె మాత్రం ఎంతో పద్దతిగా కనిపించిందంటూ బన్నీ వర్ణించాడు.

పెద్దల అంగీకారంతోనే...
అల్లు అర్జున్‌ది ప్రేమ వివాహామే అయినా పెద్దల సమక్షంలోనే అంగరంగ వైభవంగానే జరిగింది. 2011లో వీరి వివాహాం అందరి కళ్లు చెదిరిపోయేలా జరిగింది. ఇక వీరి అన్యోన్యతకు సంబంధించిన ఎన్నో ఉదాహరణలున్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా బన్నీ తన ఫ్యామిలీకి ఎంతో సమయాన్ని కేటాయిస్తుంటాడు.

అలా సెటైర్లు..
బన్నీపై సందర్భానుసారంగా స్నేహారెడ్డి సెటైర్లు వేస్తుంటుంది. అర్హతో బన్నీ పెళ్లి గురించిచర్చలు పెట్టడం, నాన్నకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పించే ప్రయత్నంపై స్నేహారెడ్డి వేసిన సెటైర్ బాగానే వైరల్ అయింది. నువ్ మీ నాన్న చెప్పిన అమ్మాయిని చేసుకున్నావా? అంటూ బన్నీ మీద స్నేహా రెడ్డి పంచ్ వేసింది.

ఎక్కడికి వెళ్లినా..
బన్నీ
స్నేహాలు
ఎక్కడికి
వెళ్లినా,
ఏ
ఈవెంట్‌లో
కనిపించినా
కూడా
హాట్
టాపిక్
అవుతుంటారు.
ఆ
మధ్య
నిహారిక
ఎంగేజ్మెంట్,
పెళ్లి
వేడుకల్లో
బన్నీ
స్నేహారెడ్డి
జంటే
వైరల్
అయింది.
బన్నీ
జంటకు
నెటిజన్లు
అందరూ
ఫిదా
అయిపోయారు.
తాజాగా
బన్నీ
షేర్
చేసిన
ఫోటో
కూడా
నెట్టింట్లో
వైరల్
అవుతోంది.

తాజ్ మహల్ వద్ద..
పదో వివాహా వార్షికోత్సవం సందర్భంగా బన్నీ తన శ్రీమతిని ప్రేమకు ప్రతిరూపమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు. ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ వద్ద బన్నీ స్నేహారెడ్డిలు రచ్చ చేశారు. ఇలా పదో పెళ్లి వేడుకను ఇలా స్పెషల్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. పదేళ్ల అద్భుత ప్రయాణం.. ఇంకా ఎన్నో ఏళ్లు ఇలాగే ఉండాలని కోరుకున్నాడు.