»   » దాసరి ఇంటి వద్ద ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్: అల్లు అర్జున్‌ ఆగ్రహం

దాసరి ఇంటి వద్ద ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్: అల్లు అర్జున్‌ ఆగ్రహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ వైపు దాసరి మరణంతో సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగి పోతే.... కొందరు అభిమానులు పిచ్చి పట్టినట్లు వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాడు.

దాసరి మరణ వార్త తెలియగానే అల్లు అర్జున్.... దాసరి నివాసం వద్దకు రాగా అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. అందులో కొందరు అభిమానులు డిజే డిజే అంటూ అరవడం మొదలు పెట్టాడు.

ఆగ్రహం వ్యక్తం చేసిన అల్లు అర్జున్

ఆగ్రహం వ్యక్తం చేసిన అల్లు అర్జున్

తన చుట్టూ చేరి దాసరి ఇంటిలోనికి వెళ్లనీయకుండా ఇబ్బంది పెట్టడంతో పాటు.... డిజె డిజే అంటూ అరవడంతో అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏయ్ అరవకండి అంటూ వారిపై మండి పడ్డారు.

పోలీసుల సహాయంతో

పోలీసుల సహాయంతో

అయితే పోలీసులు కల్పించుకుని గొడవ చేస్తున్న అభిమానులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమనిగింది. తర్వాత అల్లు అర్జున్ దాసరి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

ఆయన లేని లోటు తీర్చలేనిది

ఆయన లేని లోటు తీర్చలేనిది

అంతకు ముందు అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా దాసరికి నివాళులు అర్పించాడు. తెలుగు చిత్ర సీమకు దాసరి లేని లోటు తీర్చలేనిది అని ట్వీట్ చేసారు.

విజయ నిర్మల

విజయ నిర్మల

ఇండస్ట్రీ పెద్ద అండను కోల్పోయిందని, ఎలాంటి సమస్యలు వచ్చినా దాసరి నారాయణరావు ఉన్నారనే ధీమా ఉండేదని, ఆయనకు చెబితే న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండేదని విజయనిర్మల అన్నారు. ఇవాళ ఆయన మన మధ్య లేరని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దాసరి దర్శకత్వంలో నటించానని, అది తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. దాసరి తమ మధ్య లేకపోవడం ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. ఇండస్ట్రీలో దాసరిగారు ఒక్కరే తనను చెల్లెమ్మ అని పిలిచేవారని గుర్తు చేసారు.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

దాసరికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సందర్భంగా మంచు లక్ష్మిని మాట్లాడమని మీడియా పదే పదే కోరగా.... ఇపుడు నేను చాలా బాధలో ఉన్నాను, మాట్లాడే పరిస్థితిలో లేనని, దయచేసి మాట్లాడించే ప్రయత్నం చేయొద్దు అన్నారు. దాసరి ఒక శక్తి అని, అడిగిన వారికల్లా కాదనకుండా సహాయం చేసేవారని ఆమె సోషల్ మీడియాలో ఓ కామెంట్ చేసారు.

English summary
Allu Arjun was angry on fans, who shouted DJ Duvvada Jagannadham, when he was at Dasari Narayana Rao's residence to pay homage to the legendary director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu