»   » బన్నీ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’

బన్నీ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సక్సెస్‌తో టాప్ ఫాంలో దుసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అను ఇమ్యున‌ల్ హీరోయిన్ గా వక్కంతం వంశి ద‌ర్శ‌క‌త్వం లో ఇటీవ‌లే పూజాకార్య‌క్రమాలు జ‌రుపుకున్న "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" రెగ్యుల‌ర్ షూటింగ్ బుధవారం హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది.

యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో శరత్ కుమార్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మెగా బ్రదర్ కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మించనున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018, ఏప్రిల్ 27 న విడుద‌ల చేయ‌టానికి సన్నాహ‌లు చేస్తున్నారు.

బ‌న్ని ఎన‌ర్జి కి త‌గ్గ‌ట్టుగా

బ‌న్ని ఎన‌ర్జి కి త‌గ్గ‌ట్టుగా

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.... .వ‌రుస‌ బ్లాక్ బస్టర్స్ అందుకొని టాప్ ఫాంలో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మా బ్యాన‌ర్ లో న‌టిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈరోజు నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ మెద‌లుపెట్టాము. బ‌న్ని ఎన‌ర్జి కి త‌గ్గ‌ట్టుగా చేసిన‌ ఈ క‌థ లో అన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాలు వుంటాయి. అను ఇమ్యున‌ల్ హీరోయిన్ గా చేస్తుందన్నారు.

Allu Arjun's Next Movie Naa Peru Surya Naa Illu India Launched
వక్కతం వంశీ

వక్కతం వంశీ

టెంపర్, కిక్, రేసుగుర్రం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించి వరస సక్సెస్ లు అందుకొని తొలిసారిగా మెగా ఫోన్ ప‌ట్టిన వక్కంతం వంశీ వర్క్ చాలా ఎన‌ర్జిగా చేస్తున్నాడు.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

నాగబాబు, బన్నీవాసు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తున్నంది. విశాల్ శేఖర్ సూపర్ మ్యూజిక్ అందిస్తు్న్నారు. 2018 ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని విడ‌దుల చేసేందుకు ప్లాన్ చేస్తుననారు.

తారాగణం, తెర వెనక

తారాగణం, తెర వెనక

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,అను ఇమ్యున‌ల్, అర్జున్, శరత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), ఫైట్స్ - రామ్ లక్ష్మణ్,
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి, సంగీతం - విశాల్ - శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు,
బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్, సమర్పణ - k.నాగబాబు, సహ నిర్మాత - బన్నీ వాసు, నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి, రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ.

English summary
Basking in the success of his Duvvada Jagannadham, Allu Arjun has begun work on the forthcoming film Naa Peru Surya, in which he plays a military officer. The regular shooting of the film commenced wednesday. Naa Peru Surya is being directed by Vakkantham Vamsi, who has worked in blockbusters like Kick and Temper. Naa Peru Surya marks his directorial debut.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu