»   » శుభవార్త : అల్లు అర్జున్ తండ్రయ్యాడోచ్ (ఫోటో ఫీచర్)

శుభవార్త : అల్లు అర్జున్ తండ్రయ్యాడోచ్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఓ వైపు సంక్రాంతి పండగా సంతోషం, మరో వైపు 'ఎవడు' సినిమా సక్సెస్ అయిన ఆనందం. కానీ మెగా ఫ్యామిలీలో అంతకంటే సంతోషకరమైన సంఘటన మరొకటి చోటు చేసుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ బిడ్డకు తండ్రయ్యాడు. ఓ ప్రముఖ తెలుగు డైలీ అప్రచురించిన వార్తల ప్రకారం అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు ఆడపిల్లకు జన్మినిచ్చినట్లు సమాచారం. బుధవారం ఉదయం స్నేహారెడ్డి ప్రసవించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై ఇంకా మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక సమాచారం అందలేదు.

  ఇటీవల స్నేహారెడ్డి గర్భవతిగా ఉన్నట్లు వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఆమె ఫిబ్రవరిలో గానీ, మార్చిలో గానీ ప్రసవించే అవకావం ఉందిని అన్నారు. కానీ అంతకంటే ముందుగానే సంక్రాంతి పండగరోజు అల్లు వారి ఇంట మహాలక్ష్మి లాంటి అమ్మాయి జన్మించడం చర్చనీయాంశం అయింది. ఏది ఏమైనా అఫీషియల్ సమాచారం అందాల్సి ఉంది.

  కేవలం వివాహం మనల్ని సంతోషపరచదు. సంతృప్తికరంగా ఆనందదాయకంగా ఉండేలా మనమే మలచుకోవాలి. పరస్పర విశ్వాసమే ఆలంబనగా సాగే దాంపత్య జీవనంలో కలతలకు తావుండదనేది నిజం! ఒకరెక్కువ మరొకరు తక్కువ అనే భావన లేనంతవరకు సంసార జీవితం సాఫీగా సాగుతుందనేది సత్యం. ఇందుకు చక్కని ఉదాహరణ అల్లు అర్జున్-స్నేహారెడ్డి.

  పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డిల వివాహం మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

  స్నేహారెడ్డి అల్లు అర్జున్

  స్నేహారెడ్డి అల్లు అర్జున్

  ఈ ఫోటోలు చూస్తుంటే మీకేమనిపస్తుందో తెలియదు కానీ....అల్లు అర్జున్, స్నేహా రెడ్డి హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తీస్తే చాలా అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది.

   భార్యతో డాన్స్...

  భార్యతో డాన్స్...

  సినిమాల్లో హీరోయిన్లతో కలిసి స్టెప్పులేస్తున్నపుడు అల్లు అర్జున్ ఎలాంటి ఫీలింగుతో ఉంటారో తెలియదు కానీ...ఇక్కడ మాత్రం ఆయన మనసు నిండా ఎంతో సంతోషంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

  సినిమాలో కాదు లెండి!

  సినిమాలో కాదు లెండి!

  ఈ ఫోటో చూస్తుంటే....ఏదో సినిమా స్టిల్ లా ఉంది కాదూ. కానీ ఇది సినిమా కాదు. రియల్ లైఫ్ పిక్చర్. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రత్యేక తీయించుకున్న ఫోటో. సూపర్బ్ గా ఉంది కదూ...

   అల్లు అర్జున్

  అల్లు అర్జున్

  ఇద్దరమ్మాయిలతో షూటింగ్ సమయంలో దిగిన ఫోటోలా ఉంది. ఈ స్టిల్ చూస్తుంటే ఆ సినిమాలో స్నేహా రెడ్డి నటిస్తే బన్నీకీ పర్ ఫెక్టుగా సూటయ్యేది అని అంటున్నారంతా.

  ప్రేమ కౌగిలి

  ప్రేమ కౌగిలి

  అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారి మధ్య ఎంత అనురాగ ప్రేమ బంధం ఉందో....ఈ ఫోటోను చూసి అర్థం చేసుకోవచ్చు.

  హీరోయిన్‌కు తీసిపోని స్నేహారెడ్డి

  హీరోయిన్‌కు తీసిపోని స్నేహారెడ్డి

  ఇద్దరమ్మాయిలతో చిత్ర హీరోయిన్ అమలా పాల్, అల్లు అర్జున్ పక్క పక్కనే కూర్చున్నారు. మేకప్ లేకున్నా స్నేహా రెడ్డి అమలా పాల్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉంది కదూ!

  స్పెయిన్లో...

  స్పెయిన్లో...

  ఇద్దరమ్మాయిలతో చిత్రం స్పెయిన్లో జరిగినపుడు...బన్నీతో పాటు స్నేహా రెడ్డి కూడా వెళ్లారు. అక్కడ దిగిందే ఈ ఫోటో...

  స్నేహితులతో కలిసి..

  స్నేహితులతో కలిసి..

  పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

  స్వీట్ మెమొరీస్...

  స్వీట్ మెమొరీస్...

  ఒక వయసొచ్చాక తమ జీవితంలో గడిచిపోయిన పేజీలను తిరిగి చూసుకోవాలంటే...ఇలాంటి స్వీట్ మెమొరీస్ ఉండాల్సిందే...

   అన్యోన్య దాంపత్యం

  అన్యోన్య దాంపత్యం

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డిల వివాహం మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది.

  English summary
  According to reports, Allu Arjun blessed with a baby girl. The baby was born on Wednesday morning. The couple, who were dating for a long time tied the knot in 2011. Earlier, some reports had suggested that Sneha will give birth only in February or March.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more