»   » కాంట్రవర్సీగా మారిన అల్లు అర్జున్ కామెంట్స్.. మోడీ గురించి అలా!

కాంట్రవర్సీగా మారిన అల్లు అర్జున్ కామెంట్స్.. మోడీ గురించి అలా!

Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ మరో మారు వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ప్రముఖ మ్యాగజైన్ ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ కవర్ పేజీపై బన్నీ ఫోటోని ప్రచురించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రధాని నరేంద్ర మోడీ గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పలువురు అల్లు అర్జున్ ని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ మ్యాగజైన్ బన్నీ స్టైలిష్ స్టార్ ఆఫ్ ది మిలీనియర్ అని ప్రశంసించింది.

ఆ మ్యాగజైన్ తో జరిగిన ఇంటర్వ్యూ లో తనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదర్శమని అన్నారు. చాయ్ వాలా నుంచి భారత ప్రధానిగా మోడీ ఎదిగిన తీరు అద్భుతం అని బన్నీ ప్రశంసించాడు. ఆయన స్ఫూర్తితోనే తాను ముందుకు వెళుతా అంటూ బన్నీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Allu Arjun comments on Narendra Modi became controversy

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొందరికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చని నరేంద్ర మోడీ అల్లు అర్జున్ కు ఎలా ఆదర్శం అయ్యాడంటూ విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బన్నీపై విమర్శలు కొనసాగుతున్నాయి.

English summary
Allu Arjun comments on Narendra Modi became controversy. Social media trolling happening on Bunny
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X