»   » వావ్ బ్యూటీఫుల్...భార్యతో అల్లు అర్జున్ డాన్స్(ఫోటోలు)

వావ్ బ్యూటీఫుల్...భార్యతో అల్లు అర్జున్ డాన్స్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ తనదైన పెర్ఫార్మెన్స్‌తో స్టైలిష్ స్టార్‌గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్‌ను ప్రేమ వివాహం చేసుకున్న స్నేహా రెడ్డి కూడా భర్తకు తగిన భార్య అని నిరూపించుకుంటున్నారు. శ్రీవారితో ఆడి పాడి తనలోనూ టాలెంట్ ఉందని.....ఈ సినిమా హీరోగారికి ఏమాత్రం తీసిపోని రియల్ హీరోయిన్‌ను నేను అని గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లతో కలిసి స్టెప్పులేసారు...అయితే తన భార్య స్నేహారెడ్డితో కలిసి స్టెప్పులేయడం ఎప్పుడైనా చూసారా? అయితే ఇప్పుడు చూడండి. అందకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో ఉన్నాయి. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇటు అందంతోనూ...అటు అభినయంతోనూ బన్నీకి పెర్‌ఫెక్ట్ జోడీ అని నిరూపించుకుంటున్నారు స్నేహ.

అల్లు అర్జున్‌తో పాటు స్నేహారెడ్డి కూడా వీలు చిక్కినప్పుడల్లా సినిమా షూటింగులకు వెలుతూ ఎంతో సపోర్టివ్‌గా ఉంటున్నారు. స్నేహారెడ్డి, అల్లు అర్జున్‌లకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో వీక్షిద్దాం....

స్నేహారెడ్డి అల్లు అర్జున్

స్నేహారెడ్డి అల్లు అర్జున్

ఈ ఫోటోలు చూస్తుంటే మీకేమనిపస్తుందో తెలియదు కానీ....అల్లు అర్జున్, స్నేహా రెడ్డి హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తీస్తే చాలా అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది.

భార్యతో డాన్స్...

భార్యతో డాన్స్...

సినిమాల్లో హీరోయిన్లతో కలిసి స్టెప్పులేస్తున్నపుడు అల్లు అర్జున్ ఎలాంటి ఫీలింగుతో ఉంటారో తెలియదు కానీ...ఇక్కడ మాత్రం ఆయన మనసు నిండా ఎంతో సంతోషంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

సినిమాలో కాదు లెండి!

సినిమాలో కాదు లెండి!

ఈ ఫోటో చూస్తుంటే....ఏదో సినిమా స్టిల్ లా ఉంది కాదూ. కానీ ఇది సినిమా కాదు. రియల్ లైఫ్ పిక్చర్. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రత్యేక తీయించుకున్న ఫోటో. సూపర్బ్ గా ఉంది కదూ...

 అల్లు అర్జున్

అల్లు అర్జున్

ఇద్దరమ్మాయిలతో షూటింగ్ సమయంలో దిగిన ఫోటోలా ఉంది. ఈ స్టిల్ చూస్తుంటే ఆ సినిమాలో స్నేహా రెడ్డి నటిస్తే బన్నీకీ పర్ ఫెక్టుగా సూటయ్యేది అని అంటున్నారంతా.

ప్రేమ కౌగిలి

ప్రేమ కౌగిలి

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారి మధ్య ఎంత అనురాగ ప్రేమ బంధం ఉందో....ఈ ఫోటోను చూసి అర్థం చేసుకోవచ్చు.

హీరోయిన్‌కు తీసిపోని స్నేహారెడ్డి

హీరోయిన్‌కు తీసిపోని స్నేహారెడ్డి

ఇద్దరమ్మాయిలతో చిత్ర హీరోయిన్ అమలా పాల్, అల్లు అర్జున్ పక్క పక్కనే కూర్చున్నారు. మేకప్ లేకున్నా స్నేహా రెడ్డి అమలా పాల్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉంది కదూ!

స్పెయిన్లో...

స్పెయిన్లో...

ఇద్దరమ్మాయిలతో చిత్రం స్పెయిన్లో జరిగినపుడు...బన్నీతో పాటు స్నేహా రెడ్డి కూడా వెళ్లారు. అక్కడ దిగిందే ఈ ఫోటో....

స్నేహితులతో కలిసి..

స్నేహితులతో కలిసి..

పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

స్వీట్ మెమొరీస్...

స్వీట్ మెమొరీస్...

ఒక వయసొచ్చాక తమ జీవితంలో గడిచిపోయిన పేజీలను తిరిగి చూసుకోవాలంటే...ఇలాంటి స్వీట్ మెమొరీస్ ఉండాల్సిందే...

అన్యోన్య దాంపత్యం

అన్యోన్య దాంపత్యం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డిల వివాహం మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది.

English summary
Allu Arjun dance with his wife Snehareddy. On March 8, 2011 Arjun Married Sneha Reddy, his lady love, at Hyderabad admist who's who of South Indian Film Industries and Famous Politicians.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu