Just In
Don't Miss!
- News
గర్జించబోతున్న కేసీఆర్... 'కమ్ బ్యాక్' కోసం భారీ బహిరంగ సభ... ఈసారి తిరుగులేని వ్యూహంతో?
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జర్నలిస్టుల సంక్షేమానికి అల్లు అర్జున్ సాయం.. అండగా ఉంటానని హామీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిలిం జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సాయం అందించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటూ, దేశంలో ఎక్కడైనా ప్రకృతి విపత్తులు ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడానికి ఆర్ధిక సాయం అందించడం బన్నీ నైజం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫిలిం జర్నలిస్టుల సంక్షేమానికి అండగా నిలిచారు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'అల.. వైలుంటాపురంలో' మూవీ ఇటీవలే విడుదలై గ్రాండ్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో తెగ సంబరపడుతున్న బన్నీ.. ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరికీ సక్సెస్ పార్టీ ఇచ్చారు. ఈ సంబరాల్లో భాగంగా అల్లు అర్జున్‌ని కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు 'ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా' సభ్యులు.

వారి తెలిపిన శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పిన అల్లు అర్జున్.. వాళ్ళు అడక్కుండానే బోనస్‌గా ఫిలిం జర్నలిస్టుల సంక్షేమానికి గాను 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఇది టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అమౌంట్ మాత్రమే అని, ఇకముందు కూడా మీకు సహాయం చేస్తానని మాటిచ్చారు బన్నీ.
ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి సినిమా షూటింగ్‌లో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.