»   » ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ రూటులోనే అల్లు అర్జున్ కూడా

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ రూటులోనే అల్లు అర్జున్ కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా పవన్ కళ్యాణ్, ఎన్.టి.అర్, రామ్ చరణ్, శృతి హాసన్ లు మేక్ విష్ ఫౌండేషన్ వారి రిక్వెస్ట్ మేరకు చివర క్షణాల్లో ఉన్న తమ అభిమానులను కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి జాబితాలో అల్లు అర్జున్ కూడా వచ్చి చేరాడు. ఆయన కూడా ఓ ముగ్గురు పిల్లలు అల్లు అర్జున్ ని చూడాలని కోరగా ఆయన వారిని కలవడానికి రెడీ అయ్యారు.

వివరాల్లోకి వెళితే... ఓ ముగ్గురు పిల్లలు తమ చివరి కోరికగా అల్లు అర్జున్ చూడాలని కోరారు. ఆ విషయాన్ని మేక్ ఎ విష్ ఫౌండేషన్ వారు అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్ళడంతో అల్లు అర్జున్ కూడా ఓకే అన్నాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ రోజు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ మేక్ ఎ విష్ ఫౌండేషన్ ఆఫీస్ లో ఆ ముగ్గురు చిన్నారులను కలిసి వారితో కాస్త సమయం గడపనున్నాడు. ఈ విషయం ఆ పిల్లలకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఆ ఫౌండేషన్ వారు అంటున్నారు.

Allu Arjun

అల్లు అర్జున్ తాజా చిత్రం విశేషాలకు వస్తే...
అల్లు అర్జున్ త్వరలో బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అందులో రకుల్ ప్రీతి సింగ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ‘రకుల్ ప్రీత్ సింగ్ బోయపాటి-అల్లు అర్జున్ ప్రాజెక్టుకు లీడ్ హీరోయిన్ గా ఓకే అయింది, ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారు, జులైలో సినిమా ప్రారంభం అవుతుంది' అని బోయపాటి సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తున్న మాట.

ఈ చిత్రాన్ని బోయపాటి తనదైన శైలిలో ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బన్నీ హోం బేనర్ గీతాఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించబోతున్నారు.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బిజీగా గడుపుతోంది. ఇక్కడ షూటింగ్ పూర్తి కాగానే సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో జాయిన్ కాబోతోంది. అమ్మడికి మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘బ్రహ్మోత్సవం' చిత్రంలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది.

English summary
Allu Arjun will meet three of his little fans at the Make A Wish Foundation office at 11 am this morning.
Please Wait while comments are loading...