For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Allu Arjun: నాకేం మిగల్చలేదంటూ అల్లు శిరీష్ కామెంట్స్.. కన్నీళ్లు పెట్టుకున్న బన్నీ

  |

  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు అల్లు శిరీష్. గౌరవం సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు శిరీష్ తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. విభిన్నమైన సినిమాలతో ఎంటర్టైన్ చేసిన అల్లు శిరీష్ చివరిగా ఏబిసిడి అనే సినిమాలో నటించాడు. అయితే అల్లు శిరీష్ కు సినిమాల ద్వారా అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు.

  సుమారు మూడేళ్ల గ్యాప్ తో మరోసారి 'ఊర్వశివో.. రాక్షసివో' అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నవంబర్ 4న విడుదలైన సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో స్టేజ్ పైన అల్లు శిరీష్ మాట్లాడిన మాటలకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు.

  వర్కౌట్ కానీ కొత్త తరహా కథలు..

  వర్కౌట్ కానీ కొత్త తరహా కథలు..

  టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. ఎన్నో రకాలుగా విభిన్నంగా ట్రై చేస్తున్నప్పటికీ కూడా అదృష్టం కలిసి రావడం లేదు. రెగ్యులర్ సినిమాలు చేయకుండా బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి కొత్త తరహా కథలు కూడా వర్కౌట్ అవ్వడం లేదు. సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ ఇప్పటికే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా కొత్త తరహా బ్రాండ్ సెట్ చేసుకున్నాడు. పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు.

  ఓ మోస్తారుగా శ్రీరస్తు శుభమస్తు..

  ఓ మోస్తారుగా శ్రీరస్తు శుభమస్తు..

  అయితే అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ మాత్రం ఇంతవరకు అనుకున్నంత స్థాయిలో హిట్ అందుకోకపోవడంతో కొంత ఆలోచనలో పడ్డారు. అల్లు శిరీష్ మొదటి సినిమా గౌరవం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా ఏ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. కేవలం శ్రీరస్తు శుభమస్తు మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. ఆ సినిమాను పరశురామ్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక చివరగా చేసిన ABCD మంచి రీమేక్ కథ అయినప్పటికి అదృష్టం వరించలేదు.

  సినిమా కోసం సిక్స్ ప్యాక్..

  సినిమా కోసం సిక్స్ ప్యాక్..

  ఇలా అల్లు శిరీష్ ఎలాంటి సినిమా చేసినా కూడా అతనికి ఫెయిల్యూర్ అనేది కామన్ గా వచ్చింది. అందుకే ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ఎంతో హార్డ్ వర్క్ చేసి ఫైనల్ గా ఊర్వశివో రాక్షసివో సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా కోసం అల్లు శిరీష్ డిఫరెంట్ గా రెడీ అయ్యాడు. ఈ సినిమా కోసం బాడీలో మార్పులు చేసుకున్నాడు అల్లు శిరీష్. సినిమా ప్రారంభంలో ఏకంగా సిక్స్ ప్యాక్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

   ఆసక్తి పెంచిన పోస్టర్స్..

  ఆసక్తి పెంచిన పోస్టర్స్..

  ఊర్వశివో రాక్షసివో సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ బాగానే చేశారు. అందులో భాగంగా విడుదలైన పోస్టర్స్ ఆసక్తి పెంచాయి. ఇక ఎట్టకేలకు నవబంర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది అల్లు శిరీష్ ఊర్వశివో.. రాక్షసివో. సినిమా విడుదలైన రోజు నుంచి మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా తాజాగా సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  ఓ కొడుకులానే చూసుకుంటాడు..

  ఓ కొడుకులానే చూసుకుంటాడు..

  ఈ క్రమంలో స్టేజి పైకి వచ్చిన అల్లు శిరీష్.. అతని సోదరుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పాడు. "ఇలా సక్సేస్ మీట్ లో స్టేజిపైన అందరూ చిత్రబృందానికి థ్యాంక్స్ చెప్పడం సాధారణమే. నేను కూడా అదే చెబుతాను. కానీ బన్నీ నన్ను ఎప్పుడూ తమ్ముడిలా చూడలేదు. ఓ కొడుకులానే చూసుకుంటాడు. ఇప్పటికీ కూడా బర్త్ డే విషెస్ చెప్పిన మై బేబీ శిరి అని రాస్తుంటాడు. చాలా రోజుల తర్వాత తనను నేను కలిస్తే చిన్న పిల్లాడిలా బుగ్గలు గిల్లి ముద్దు చేస్తుంటాడు.

  తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం..

  తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం..

  మా అన్నయ్యకు నేనంటే అంతా ప్రేమ. తనకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. నేను ఏదైనా జీవితంలో సాధించాలనుకుంటే అవేవీ మిగల్చకుండా పెట్టాడు. అందుకు కూడా తనకు థ్యాంక్స్. 2023లో పుష్ప 2తో బాక్సాఫీస్ బద్దలైపోతుంది. మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో దేశానికి చూపిస్తుంది" అని అల్లు శిరీష్ బన్నీ గురించి స్పీచ్ ఇచ్చాడు. తనగురించి తమ్ముడు అలా మాట్లాడుతుంటే అల్లు అర్జున్ ఎమోషనల్ అయి కన్నీళ్లు తుడుచుకున్నారు.

  అదిరిపోయిన కెమిస్ట్రీ..

  అదిరిపోయిన కెమిస్ట్రీ..

  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతున్నాయి. ఇక లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమాను జత కలిసే, విజేతే సినిమాలకు దర్శకత్వం వహించిన రాకేష్ శశి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇందులో అల్లు శిరీష్ కు జంటగా అను ఇమ్మాన్యుయేల్ జోడి కట్టింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయిందని టాక్ వచ్చింది. అలాగే వెన్నెల కిశోర్, సునీల్ కామెడీ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

  English summary
  Icon Star Allu Arjun Gets Emotional Over Allu Sirish Speech About Him On Urvasivo Rakshasivo Movie Success Celebrations And Video Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X