»   » అల్లు అర్జున్ ‘సుల్తాన్‌.. సుల్తానీ’..ఈ గెటప్ ఏంటి..అసలు కథేంటి

అల్లు అర్జున్ ‘సుల్తాన్‌.. సుల్తానీ’..ఈ గెటప్ ఏంటి..అసలు కథేంటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌:ఫేస్ బుక్ , ట్విట్టర్ లో అల్లు అర్జున్ హఠాత్తుగా ఇదిగో ఈ క్రింద గెటప్ లో సుల్తాన్,సుల్తానీ అంటూ కనపడ్డాడు. ఇదేంటి ఈయన ఏమన్నా సుల్లాన్..సుల్తానీ అనే సినిమాలో చేస్తున్నాడా అనే సందేహం వచ్చింది కదూ... అలాంటిదేమీ లేదు.

రీసెంట్ గా 'సరైనోడు' సక్సెస్‌తో హ్యాపీగా ఉన్న అల్లు అర్జున్...తన భార్య స్నేహతో కలిసి టర్కీలో ఉన్నారు. అక్కడున్న వివిధ ప్రదేశాలను చుట్టేస్తూ.. చాలా సంతోషంగా గడుపుతున్నారు.

అందులో భాగంగా ఇస్తాంబుల్‌లోని సుల్తాన్‌ అహ్మద్‌ కమీ (బ్లూ మసీదు) అద్భుతంగా ఉందని, ఇంత వరకూ ఇలాంటిది చూడలేదని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా తీసిన మసీదు ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

ఇక ఎలాగో అక్కడకి వెళ్లాం కదా అని సరదాకొద్ది తన భార్య స్నేహారెడ్డితో కలిసి టర్కీ సుల్తాన్‌ కాలం నాటి వస్త్రాలు ధరించి ఫొటోకు ఫోజిచ్చి ఎంజాయ్ చేయమని , సుల్తాన్‌, సుల్తానీ అని పోస్ట్‌ చేశారు. కొద్ది రోజుల క్రితమే విహారయాత్ర నిమిత్తం టర్కీ వెళ్లినట్లు అల్లు అర్జున్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపారు.

కెరీర్ విషయానికి వస్తే...బన్నీ ప్రస్తుతం ద్విభాషా చిత్రం చేసే యోచనలో ఉన్నందున తర్వాతి సినిమా తమిళ దర్శకుడితోనే అంటూ ప్రచారం జరుగుతోంది. లింగుసామితో సినిమా దాదాపు ఖాయమని వినికిడి. ఈ సినిమా పూర్తయ్యాక హరీష్ శంకర్‌తో సినిమా చేసే అవకాశాలున్నాయి.

అల్లు అర్జున్ తన భార్యతో కలిసి ఇదిగో ఇలా సుల్తాన్,సుల్తానీ అంటూ కనపడుతున్నాడు. ఇదేంటి వీరిద్దరూ కలిసి ఏదన్నా సినిమా ప్లాన్ చేస్తున్నారా అని ఆశ్చర్యపోకండి.అంతలేదు..బన్ని ప్రస్తుతం టర్కీ టూర్ లో ఉన్నారు. అక్కడ ఆయనకు ఆ గెపట్స్ చూస్తూంటే సరదాపుట్టింది..అంతే ఇదిగో ఇలా మారిపోయారు.

English summary
Telugu actor Allu Arjun, who is basking in the success of latest Telugu blockbuster Sarrainodu, will jet off on a holiday to Turkey this weekend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu