»   » ట్విట్టర్ ఎకౌంట్ గురించి తేల్చి చెప్పిన అల్లు అర్జున్

ట్విట్టర్ ఎకౌంట్ గురించి తేల్చి చెప్పిన అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ కి ట్విట్టర్ ఎకౌంట్ ఇప్పటివరకూ లేదు. అయితే భవిష్యత్ లో కూడా ట్విట్టర్ ఎకౌంట్ ఓపెన్ చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. బద్రీనాధ్ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియా అందరు హీరోలు ట్విట్టర్ ఎకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు కదా మరి మీరెప్పుడు అని అడిగితే తనకి ఇంట్రస్టు లేదని తేల్చి చెప్పాడు. ఇక గతంలో ఒకసారి అల్లు అర్జున్ ఎకౌంట్ అంటూ ఓ ఫేక్ ఎకౌంట్ క్రియేట్ అయ్యింది.అప్పుడు అతని సోదరుడు అల్లు శిరీష్ తన బ్రదర్ కి ఏ ఎకౌంట్ లేదని క్లారిఫై చేసాడు.

ఇక బద్రీనాధ్ విషయానికి వస్తే..భారి అంచనాలతో విడుదలైన అల్లు అర్జున్, వివి వినాయక్‌ల 'బద్రినాధ్"మొదటివారం ఓపినింగ్స్, వీకెండ్ కలెక్షన్స్ తో హోరెత్తిచింది. మరో ప్రక్క అల్లు అరవింద్ ఈ చిత్రానికి చేస్తున్న ప్రమోషన్ కూడా జనాలని ధియోటర్ వైపుకు లాక్కెళ్ళగలిగింది. అయితే రిలీజ్ రోజు మార్నింగ్ షో కే ఫ్లాప్ టాక్ రావటంతో కలెక్షన్స్ డ్రాప్ అవటం ప్రారంభమైంది. అది రెండో వారానికి పూర్తిగా ధియోటర్స్ లో కనపడటం మొదలైంది. సాంకేతికంగా ఉన్నత స్ధాయిలో ఉన్నా కధా, కథన లోపమే ఈ చిత్రానికి శాపంగా మారిందని చెప్తన్నారు.

English summary
When asked if Allu Arjun had joined twitter heeding to his brother's Allu Sirish's request so that he could be in touch with his fans, Arjun said, "I may be a gadget freak but let me tell you clearly 'I'm not on twitter'."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu