»   » దాసరి గారి వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్

దాసరి గారి వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :అది దాసరిగారి వ్యక్తిగత అభిప్రాయం. నా అభిప్రాయం ఏమిటో 'రుద్రమదేవి' పాటల వేడుకలో చెప్పా. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లాంటి లెజెండ్స్‌ గురించి చెప్పినప్పుడు చిరంజీవిగారి గురించి కూడా ప్రస్తావించాల్సింది. అయితే ఇదేం కావాలని చేసింది మాత్రం కాదు అని అల్లు అర్జున్ అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'సత్యమూర్తి..' పాటల వేడుకలో దాసరి నారాయణరావు మాట్లాడుతూ స్త్టెల్‌ విషయంలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తరవాత పవన్‌ కల్యాణే అన్నారు. ఈ మాట మెగా అభిమానుల్లో చర్చనీయాంశం అయ్యింది. చిరంజీవి పేరు ప్రస్తావించలేదని వాళ్లు కినుక వహించారు. ఈ అంశంపై అల్లు అర్జున్ తాజాగా స్పందిస్తూ ఇలా అభిప్రాయం చెప్పారు.


Allu Arjun reaction on Dasari Comments

అలాగే...'సన్నాఫ్..' ఆడియోలో చిరంజీవిని దాసరి ప్రస్తావిం చకపోవడం అనేక వ్యాఖ్యలకు తావిచ్చింది? సహజంగానే బయట విమర్శలు వస్తాయి కదండీ! ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత పవన్ కల్యాణ్ ప్రత్యేక స్టయిల్ తెచ్చారని ఆయన అన్నారు. కొన్నిసార్లు వేదికపై కొన్ని పేర్లు చెప్పడం మర్చిపోతుంటాం.


ఒకసారి ఆడియో వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పడం నేనే మర్చిపోయా. దాసరి గారు అలాగే మర్చిపోయి ఉండవచ్చు. అది కావాలని జరిగిందో, అనుకోకుండా జరిగిందో నాకు తెలియదు. ఏమైనా, దాసరిగారు మా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన్ని మేము గౌరవించాలి. అంతే అన్నారు.


ఇక దానికి వచ్చిన విమర్శల వల్లనేనా మీరు వరంగల్‌లో 'రుద్రమదేవి' ఆడియోలో చిరంజీవి పేరు తెచ్చి, ఆ చెట్టు నీడన పెరిగామన్నారు? అవును. కచ్చితంగా అందుకే అన్నాను అని అల్లు అర్జున్ చెప్పారు. 

English summary
Allu Arjun said that Dasari Comments on Style is not a big issue.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu