బన్నీ రింగ, రింగ సాంగ్ బాలీవుడ్ సూపర్ స్టార్ మూవీలో....
అల్లు అర్జున్ నటించిన 'ఆర్య 2' చిత్రంలో 'రింగ రింగ" అనే ఐటమ్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఐటమ్ సాంగ్స్ ల్లో ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఈ పాటకు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్4 క్రికెట్ మ్యాచ్ లో ఇటీవల షారుఖ్ ఖాన్ కూడా స్టెప్స్ వేశాడంటే ఈ పాట పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఇప్పుడు ఈ పాట సల్మాన్ ఖాన్ కు తెగ నచ్చేసింది. ప్రస్తుతం అసిన్ తో తను కలిసి నటిస్తున్నచిత్రంలో ఈ పాట పెట్టుకుంటున్నాడు. ఈ పాటకు హిందీలో కూడా దేవీశ్రీప్రసాదే సంగీతం సమకూర్చుతున్నాడు. కాగా రామ్, జెనీలియా జంటగా నటించిన తెలుగు చిత్రం 'రెడీ"కి రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలోనే సల్మాన్ ఈ పాటను పెట్టుకోవడం మరో విశేషం.
More from Filmibeat
salman khan allu arjun arya2 asin shahrukh khan ready సల్మాన్ ఖాన్ అల్లు అర్జున్ ఆర్య2 అసిన్ షారుఖ్ ఖాన్ రెడీ


Click it and Unblock the Notifications











