»   » రుద్రమదేవి: అల్లు అర్జున్ న్యూ లుక్ (ఫోటోలు)

రుద్రమదేవి: అల్లు అర్జున్ న్యూ లుక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్‌లో 'రుద్రమదేవి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోనగన్నారెడ్డి అనే పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి లుక్‌లో కనిపించబోతున్నారు.

ఈ మేరకు పాత్రకు తగిన విధంగా గడ్డం, మీసం పెంచుతున్నాడు అల్లు అర్జున్. ఇటీవల పలు కార్యక్రమాలకు హాజరైన అల్లు అర్జున్ రఫ్ లుక్‌తో కనిపించడమే ఇందుకు నిదర్శనం. అంతే కాకుండా పాత్ర కోసం యుద్ధ విన్యాసాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ లుక్‌కు సంబంధించిన ఫోటోలు, గోన గన్నారెడ్డి పాత్రకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

గోన గన్నారెడ్డి

గోన గన్నారెడ్డి

కాకతీయుల చరిత్రలో రుద్రమదేవితో పాటు చిరస్థాయిగా జనం గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి గోనగన్నారెడ్డి. అప్పట్లో వర్ధమానపురంగా పిలవబడిన నేటి మహబూబ్ నగర్ జిల్లా వడ్డెమాన్ కి చెందిన ఈ వీరుడిగాథ చాలా ఆసక్తికరం.

పాత్ర తీరు తెన్నలు

పాత్ర తీరు తెన్నలు

ఓ బందిపోటుగా, రాబిన్ హుడ్ తరహాలో జనం కోసం రుద్రమదేవితోనే పోటాపోటీగా తలపడ్డ పాత్ర. ధైర్య సాహసాలతో పాటు, ఎలాంటి సమస్యని అయినా, ఈజీగా గోయింగ్ గా ఫేస్ చేసే ఓ యూత్ ఫుల్ వారియర్ క్యారెక్టర్ ఇది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ పాత్రకి ఎవరిని ఎంచుకోవాలా అని తర్జన భర్జన పడ్డ దర్శకుడు... అల్లు అర్జున్‌ను ఎంచుకున్నాడు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ...స్పెషల్ అప్పియరెన్స్ అయినా...సినిమా చూసాక రుద్రమదేవితో పాటు వెంటాడే అద్భుతమైన పాత్ర. చివరికి నా ఊహలో ఎలా ఉంటే ఈ పాత్ర బాగుంటుందని ఆశించానో, అలాంటి అద్భుతమైన ఆర్టిస్ట్, యూత్ ఐకాన్ ఈ పాత్ర చేయడానికి ముందుకొచ్చారు. తను మరెవరో కాదు బాక్సాఫీసులో రేసుగుర్రంలా దూసుకెలుతున్న అల్లు అర్జున్ అని చెప్పారు.

బన్నీ స్పూర్తి

బన్నీ స్పూర్తి

అల్లు అర్జున్ ‘రుద్రమదేవి' సినిమాలో గోనగన్నారెడ్డి పాత్ర చేయడం ద్వారా ఈ జనరేషన్ హీరోలు కూడా ఇలాంటి చిత్రాలు చేయడానికి స్పూర్తిగా, నాందిగా నిలుస్తాడు. గోనగన్నారెడ్డి పాత్ర చేయడానికి అంగీకరించి, తెలుగు జాతి చరిత్రని, సంస్కృతిని గౌరవించిన బన్నీకి గతంలో నేను పడ్డ ‘బకాయి'ని ఈ చిత్ర ఘన విజయం ద్వారా తీర్చుకుంటాను అని గుణశేఖర్ తెలిపారు.

English summary
Allu Arjun rugged look for 'Rudhrama Devi'. He is going to play a crucial role in Gunasekhar's historical film Rudhrama Devi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu