»   » దాసరిపై ‘మెగా’ దండయాత్ర: నిన్న చరణ్, నేడు బన్నీ!

దాసరిపై ‘మెగా’ దండయాత్ర: నిన్న చరణ్, నేడు బన్నీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల ‘సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో వేడుకలో దాసరి నారాయణరావు చేసిన వ్యాఖ్యలు మెగా క్యాంపులో ఆగ్రహ జ్వాలలు రగిల్చాయి. దాసరి ఆ వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇవ్వగా.....ఇటీవల రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా దాసరిపై సెటైర్లు విసిరారు. తాజాగా బన్నీ ఏకంగా తన వ్యాఖ్యలతో దుమ్ము తులిపారు. మెగా క్యాంపు దాసరిపై ఈ రేంజిలో దండయాత్ర చేయడానికి కారణం....దాసరి చేసిన వ్యాఖ్యల్లో మెగాస్టార్‌ చిరంజీవి లెక్కలోంచి తీసేయడమే.

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తరువాత ఆ స్థాయిలో పరిశ్రమలో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి చిరంజీవి. అయితే దాసరి చిరంజీవి పేరు చెప్పకుండా.....ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ చేసిన వ్యాఖ్యలు మెగా క్యాంప్ ఆగ్రహానికి కారణమయినట్లు తెలుస్తోంది. దాసరి నారాయణరావు కావాలనే చిరంజీవి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని....చిరంజీవి-పవన్ కళ్యాణ్ వేరు చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు అభిమానులు మండి పడుతున్నాయి.

Allu Arjun's counter to Dasari!

దాసరి వ్యాఖ్యలకు కౌంటర్‌గా బండ్ల గణేష్ అదే రోజు ట్విట్టర్ ట్వీట్ల వర్షం కురిపించారు. చిరంజీవి లేని తెలుగు సినీ పరిశ్రమను ఊహించలేం అంటూ.....మెగాస్టార్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. మొన్న రామ్ చరణ్ తన ఫేస్ బుక్ ఖాతాలో సెన్సేషన్ కామెంట్స్ చేసారు. కోతి కల్లు తాగితే ఎలా ప్రవర్తిస్తుంది తెల్సుగా.. ఇక మైక్ దొరికితే మీరే ఊహించుకొండంటూ వ్యాఖ్యానించారు.

ఇక...రుద్రమదేవి సినిమా ఆడియో ఫంక్షన్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మన చరిత్ర ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుండి వచ్చాం అనేది మర్చిపోనేకూడదు. నాకూ ఓ చరిత్ర ఉంది. దాని పేరు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ ఎండలో నిలబడితే, మేమందరం ఆయన నీడలో పెరిగాం. ఎవరి తరువాత ఎవరు అనే ప్రశ్న వస్తే నాకు మాత్రం చిరంజీవి తరువాతే ఎవరైనా అంటూ సూటిగా చెప్పాడు. అంతే కాదు చిరంజీవి అల్లు అర్జున్‌కి చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. ఒక వ్యక్తిపై కామెంట్లు చేసి, సెటైర్లు వేసి, పంచ్ డైలాగులు చెప్పి అభిమానులతో చప్పట్లు కొట్టించుకోవటం తేలికే.. కానీ వారి గుండెల్లోకి పదిలంగా వెళ్ళిపోవడం మాత్రం కష్టం అంటూ చెప్పాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానంటూ ముగించాడు.

English summary
The controversial statements of Dasari Narayana Rao on Chiranjeevi in S/O Satyamurthy Audio release function created a stir in Mega fans. They are even annoyed with Allu Arjun for not giving a retort to Dasari then itself. However Allu Arjun reacted and tried some damage control stuff in the audio release event of Rudramma Devi in Warangal.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu