For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ 'జులాయి' టాక్ ఏంటి?

  By Srikanya
  |

  హైదరాబాద్: అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొంది ఈ రోజు విడుదల అయిన రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఈ చిత్రం ప్రీమియర్ షోలు చాలా చోట్ల పడ్డాయి. వాటి టాక్ ప్రకారం ఈ చిత్రం సాదా సీదా స్టోరీ లైన్ తో ఉన్నా త్రివిక్రమ్ మార్కు సెంటిమెంట్,ఫన్ డైలాగులతో కొట్టుకొస్తుంది. హ్యాపీ,ఆర్య సినిమాలలో చేసిన క్యారెక్టర్ తరహాదే ఈ చిత్రంలో అల్లు అర్జున్ పోషించిన రవి పాత్ర అని తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ తనదైన శైలిలో కొత్తగా ప్రయత్నించి మార్కులు కొట్టేసాడు అంటున్నారు. స్టైలిష్ స్టార్ అన్నపదానికి న్యాయం చేసే విధంగా డాన్స్ లు,ఫైట్స్ ఇరగతీసాడు.

  అలాగే ఇలియానా ..మధు పాత్రలో జల్సా మ్యాజిక్ ని రిపీట్ చేయటానికి ప్రయత్నించింది. ఇంటర్వెల్ సీన్ దగ్గరలో ఆమె చేసిన నటన చాలా బాగుంది. ఆమె హైటెక్ ఇంజినీర్ గా ఈ సినిమాలో కనిపిస్తుంది. సమాజం పట్ల భాద్యత కల పాత్రలో ఆమె మరిపిస్తుంది. స్నేహితుడుతో తన అభిమానులను నిరాసపరిచిన ఇలియానా ఈ సినిమాలో ఆ లోటుని భర్తి చేసింది. ముఖ్యంతా ఆర్బన్ యూత్ క్యారెక్టర్ లో కనిపించిన అల్లు అర్జున్ కి సరైన జోడీగా న్యాయం చేసింది. రాజేంద్రప్రసాద్ నటనకూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

  ఖలేజాతో నిరాసపరిచిన త్రివిక్రమ్ ఈ సినిమాతో ఫుల్ మీల్స్ తినిపించాడు. టెక్నికల్ గా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా ఎప్పటిలాగే త్రివిక్రమ్ మార్క్ వన్ లైనర్స్,పంచ్ డైలాగులు పేలాయి. కెమెరా వర్క్ హైలెట్ గా నిలుస్తుంది. పకడో పకడో పాటను క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో పెట్టారు. ఇలియానా,అల్లు అర్జున్ మద్య వద్దే లవ్ ట్రాక్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది.

  ''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు, అర్జున్‌ నృత్యాలు అలరిస్తాయని''అన్నారు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ. అలాగే...జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.

  English summary
  Allu Arjun’s romantic entertainer Julayi released today. The music has been composed by Devi Sri Prasad and the title track has been done by Rama Jogayya Shastry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X