For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ ‘జులాయి’హైలెట్స్ ఏమిటి?

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లు అర్జున్‌,ఇలియానా కాంబినేషన్‌లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రూపొందిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'జులాయి'. ఆగస్టు 9న విడుదల అవుతున్న ఈ చిత్రంపెై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, మళయాళ భాషల్లో ఈ సినిమా ఒకే రోజు విడుదల కాబోతుండటం విశేషం. తెలుగులో ఈ సినిమా దాదాపు 1600 స్క్రీన్ లపై ప్రదర్శితమవ్వనుంది. ఈ సినిమా 'ప్రమోషనల్' సాంగ్ రూపంలో వేసిన ఎత్తుగడ వర్కవుటయ్యింది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. పాటలుకు బయిట మంచి క్రేజ్ వచ్చింది.

  ఇక ఈ చిత్రం హైలెట్స్ విషయానికి వస్తే...

  త్రివిక్రమ్ తన అంతకు ముందు ఫెయిల్యూర్ ఖలేజాను మరిపించటానికి ఈ చిత్రం కథ,డైలాగులు మంచి కసితో ఆద్యంతం ఎంటర్టైంట్మెంట్ తో రాసి తెరక్కించాడని సమాచారం. ప్రెష్ గా ఉండే ఆ సీన్స్, సన్నివేశాలు రిపీట్ ఆడియన్స్ ను తీసుకురావటం ఖాయం అంటున్నారు.

  అల్లు అర్జున్ గతంలో కన్నా ఈ చిత్రంలో మరింత ఈజ్ తో చేసిన డాన్స్ లు ఆడియన్స్ ని స్పెల్ బౌండ్ చేస్తాయి. ఇలియానా కూడా గ్లామర్ కాస్తంత ఎక్కవ ఒలికపోసి యూత్ కి కిక్కివ్వబోతోంది. దీనికి తోడు దేవిశ్రీ ప్రసాద్ మంచి ఊపు మీద ఇచ్చిన పాటలు మొదట్లో కాస్త స్లోగా ఉన్నాయి అని టాక్ వచ్చినా మెల్లిగా యూత్ ని పట్టేసాయి. వాటికి అల్లు అర్జున్ వేసే స్టెప్ లకు ధియోటర్స్ లో విజిల్స్ ఖాయం.

  మాస్ ని ఆకట్టుకునే కామిడీ,యాక్షన్ సీన్స్ కు ఈ సినిమాలో లోటు లేదు. పీటర్ హెయిన్స్ సమకూర్చిన బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ హైలెట్. దీనికి తోడు బ్రహ్మానందం,అలీ,ఎమ్ ఎస్ నారాయణ తో త్రివిక్రమ్ తన దైన శైలిలో పంచ్ వేసి ధియోటర్ లను నవ్వులలో ముంచెత్తనున్నారు.

  'జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్‌ శెైలి సంభాషణలు, అర్జున్‌ నృత్యాలు అలరిస్తాయి. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు కొందరు... అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి.

  English summary
  
 Allu Arjun's upcoming movie Julayi, which is one of the most-awaited movies of 2012, is finally all set to release in 1,600 theatres across the country on this Friday, August 9. This romance drama deals with how the life of an aimless guy changes after he falls in love with a girl. The posters and promo videos have created a lot of curiosity among the movie buffs, who are eagerly waiting to see the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X