»   » యూరప్‌కు అల్లు అర్జున్ ‘రేస్ గుర్రం’

యూరప్‌కు అల్లు అర్జున్ ‘రేస్ గుర్రం’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించబోయే చిత్రం 'రేస్ గుర్రం'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్. వక్కంతం వంశీ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమాని నల్లమల్లపు బుజ్జి మరియు డా.వెంకటేశ్వర రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్ జులై 1 నుంచి యూరప్ లో  జరుగనుంది. యూరప్ ఖండంలోని వివిధ లొకేషన్లలో చిత్రీకరణ జరుపనున్నారు. ఇక్కడ ఈచిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ జరుగనుంది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో విడుదల కానున్నది.

ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్టు కొంత ఇప్పటికే హైదరాబాద్‌లో చిత్రీకరిచారు. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూరప్ లో షూటింగ్ ప్లాన్ చేసారు. ఇంతకు ముందు ఊరసవెల్లి చిత్రంలో జూ ఎన్టీఆర్‌ను స్టైలిష్‌గా ప్రజెంట్ చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ను సరికొత్తగా చూపించబోతున్నారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'రేష్ గుర్రం' చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. గతంలో సురేందర్ రెడ్డి, తమన్ కాంబినేషన్లో వచ్చిన 'కిక్' చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, కథ : వక్కతం వంశీ.

English summary
Allu Arjun-starrer Race Gurram will have its overseas schedule in Europe. Director Surender Reddy will shoot a couple of romantic numbers on the lead cast from July 1 in the picturesque locations of Europe.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu