»   » నా తండ్రి పేరు అల్లు అర్జున్.. నేను మహేశ్ ఫ్యాన్‌ని.. అల్లు అయాన్ వీడియో వైరల్

నా తండ్రి పేరు అల్లు అర్జున్.. నేను మహేశ్ ఫ్యాన్‌ని.. అల్లు అయాన్ వీడియో వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంట్లో ఎంతమంది హీరోలు ఉన్నా.. తన మనసుకు నచ్చిన వారే అభిమాన హీరో. పెద్దలయితే చెప్పడానికి సంశయిస్తారు కానీ పిల్లలు మాత్రం ఎలాంటి భయం లేకుండా ఫలానా హీరో నాకు ఇష్టమని ఠక్కున చెప్పేస్తారు. అది అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ విషయంలో స్పష్టమైంది. ఇటీవల అల్లు అయాన్ 'నేను మహేశ్‌బాబు ఫ్యాన్' అంటూ చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఏంటో మీరే చూడండి.

అయాన్ సైకిల్ తొక్కుతూ..

అయాన్ సైకిల్ తొక్కుతూ..

ప్రతీ తల్లిదండ్రుల మాదిరిగానే తమ కుమారుడు అల్లు అయాన్ అంటే అల్లు అర్జున్ దంపతులకు చెప్పలేనంత ఇష్టం. చాలా ముద్దుగా, ప్రేమతో చూసుకొంటారని పలు సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా వ్యక్తమైంది. తాజాగా ఇంట్లో సైకిల్ తొక్కుతున్న అయాన్ ప్రశ్నలు వేస్తూ కొన్ని సమాధానాలు రాబట్టారు. వాటికి చాలా చక్కగా అయాన్ జవాబు ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకొంటున్నది.

నా పేరు అయాన్.. నా తండ్రి పేరు అర్జున్

నా పేరు అయాన్.. నా తండ్రి పేరు అర్జున్

సైకిల్ తొక్కుతున్న అయాన్‌ను నీవు ఎవరు అంటే నా పేరు అయాన్ అని, నీ ఫాదర్ పేరు ఏంటీ అంటే అల్లు అర్జున్ అని ఠక్కున సమాధానమిచ్చారు. అలాగే కొన్ని ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెప్తున్న అయాన్ మరో ప్రశ్న వేయగా దానికి తడుముకోకుండా జవాబు చెప్పడం పలువురిని అలరించింది.

నేను మహేశ్ బాబు ఫ్యాన్‌ని

నేను మహేశ్ బాబు ఫ్యాన్‌ని

ఇంట్లో సైకిల్ తొక్కుతూ బిజీగా ఉన్న అయాన్‌ను ‘సైకిల్ తొక్కేటప్పుడు నీవు ఎవరు అని అనగా ‘నేను మహేశ్‌బాబు' అని అల్లు అయాన్ సమాధానిమివ్వడంతో ప్రిన్స్‌పై పిల్లలకు ఉండే అభిమానం చెప్పకనే చెప్పింది. ప్రిన్స్ మహేశ్‌బాబులా పరుగెత్తడం, శ్రీమంతుడు సినిమా తర్వాత సైకిల్ తొక్కుతూ ప్రిన్స్‌ మాదిరిగా ఫీలవ్వడం పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఫ్యాషన్ అయిపోయింది.

అల్లు అర్జున్‌కు క్రేజ్..

తండ్రి అల్లు అర్జున్ అంటే తెలుగు ప్రేక్షకులే కాదు.. మలయాళ సినీ అభిమానులు పడిచస్తారు. వారి ఇంట్లోనే అల్లు శిరీష్ ఉన్నాడు. అంతేకాకుండా మెగా ఫ్యామిలో చిరంజీవి, పవన్ కల్యాణ్, రాంచరణ్, సాయి ధరమ్ తేజ్ ఉన్నారు. వారందరిలో ఎవర్ని ఇష్టపడకుండా మహేశ్ బాబు‌ను ఇష్టపడటం పిల్లల మనస్తత్వానికి అద్దం పట్టింది. ఎంతమంది హీరోలు ఉన్నా తనకు నచ్చిన వారే అభిమాన హీరో అని పిల్లలు ఫిక్సై పోతుంటారు. అందుకు అల్లు అయాన్ మినహాయింపు కాదని స్పష్టమైంది. ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది..

English summary
Allu Arjun's son Allu Ayaan's latest twitter video goes viral in social media. Ayaan said that I am Allu Ayaaan. My fathers name is Allu Arjun. I am Mahesh Babu fan. Little master ayaan words are attracting the social media users.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu