»   » 'సన్నాఫ్‌ సత్యమూర్తి' ఆడియో విడుదల... ఫొటోలు

'సన్నాఫ్‌ సత్యమూర్తి' ఆడియో విడుదల... ఫొటోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ' సన్నాఫ్‌ సత్యమూర్తి'.సమంత, నిత్యమేనన్‌, అదాశర్మ , రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందించిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హోటల్‌ నోవాటెల్‌లో జరిగింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ప్రముఖ దర్శకుడు దాసరినారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు అల్లు అరవింద్‌, అలీ, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.


ఈ ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్ గా అభిమానులందరినీ అలరించే విధంగా జరిగింది. మీరు ఇక్కడ ఆ వేడుక కు సంభందించిన ఫొటోలు చూడవచ్చు. ఓ కుటంబంలాగ సినిమా యూనిట్ మొత్తం ఈ వేడుకలో పాల్గొంది.


స్లైడ్ షోలో..ఆ ఫొటోలు


ఆవిష్కరణ

ఆవిష్కరణ

ప్రముఖ దర్శకుడు దాసరినారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించారుఅందుకున్నారు

అందుకున్నారు

దాసరి ఆవిష్కరించిన ఆడియో సీడిని అల్లు అరవింద్ అందుకున్నారుదాసరి మాట్లాడుతూ

దాసరి మాట్లాడుతూ

'' 'అత్తారింటికి దారేది' విజయం తర్వాత త్రివిక్రమ్, 'రేసు గుర్రం' విజయం తర్వాత అల్లు అర్జున్ చేసిన ఈ చిత్రం ఆ రెండు చిత్రాలకు దీటుగా ఉంటుందనిపిస్తోంది. ప్రచార చిత్రాలు, పాటలు బాగున్నాయి'' అన్నారు.


రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ -

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ -

''మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో 'జులాయి' తర్వాత మళ్లీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. 'జులాయి' సినిమా కన్నా పెద్ద హిట్ అవ్వాలన్న భయం, భక్తులతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా చేశారు. మాతో కూడా అలా నటింపజేశారు. ఆ సినిమా కన్నా నాలుగింతలు బాగుంటుందీ సినిమా. నా డార్లింగ్ అల్లు అర్జున్‌తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది'' అని తెలిపారు.


త్రివిక్రమ్ మాట్లాడుతూ...

త్రివిక్రమ్ మాట్లాడుతూ...

ఇది కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుందని త్రివిక్రమ్ అన్నారు.అల్లు అర్జున్ ధాంక్స్...

అల్లు అర్జున్ ధాంక్స్...

విచ్చేసిన అతిథులకు, అభిమానులకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు.బ్రహ్మానందం మాట్లాడుతూ...

బ్రహ్మానందం మాట్లాడుతూ...

మంచి విజయం సాధిస్తుందని ..నవ్విస్తూ హామీ ఇచ్చారుసమంత మాట్లాడుతూ...

సమంత మాట్లాడుతూ...

మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అన్నారు. త్రివిక్రమ్ గారి టీమ్ కు,యూనిట్ అంతా నాకు కుటుంబం లాంటిదని అన్నారు. అత్తారింటికి దారేది తర్వాత ఈ సినిమా కూడా మంచి అందమైన ఫ్యామిలీ ఫిల్మ్ అన్నారు.


అలీ మాట్లాడుతూ...

అలీ మాట్లాడుతూ...

నువ్వే నువ్వే అనే టైటిల్ పెట్టిన దగ్గర నుంచి హీరోలంతా త్రివిక్రమ్ తో రెండేసి రెండేసి చొప్పున సినిమాలు చేస్తున్నారు అన్నారు. అల్లు అరవింద్ గారు హీరోగా ఓ సినిమా చేస్తున్నారు అని చెప్పి నవ్వించారు.


ఉపేంద్ర మాట్లాడుతూ...

ఉపేంద్ర మాట్లాడుతూ...

చాలా పెద్ద వాళ్లంతా ఉన్నారు..ఏం మాట్లాడాలో తెలయటం లేదు. నాకు కెమెరా ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడగలను కానీ ఇలా స్టేజీపై మాట్లాడలేను...నేను చాలా లక్కీ...నా ఫేవరెట్ స్టార్ బన్నీతో చేసే అదృష్టం దక్కింది అన్నారు.


దేవి లైవ్ ఫెరఫార్మెన్స్

దేవి లైవ్ ఫెరఫార్మెన్స్

ఈ ఆడియోఫంక్షన్ లో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ లైవ్ ఫెరఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


'సన్నాఫ్‌ సత్యమూర్తి' ఆడియో విడుదల... ఫొటోలు

'సన్నాఫ్‌ సత్యమూర్తి' ఆడియో విడుదల... ఫొటోలు

బ్రహ్మానందం, అలీ, ఉపేంద్ర, దేవిశ్రీ ప్రసాద్, సమంత, అదా శర్మ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.


నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ...

నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ...

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా రూపొందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తివిక్ర‌మ్ అత్తారింటికి దారేది చిత్రం త‌రువాత అల్లు అర్జున్ రేసుగుర్రం చిత్రం త‌రువాత చేస్తున్నందున‌ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి అన్నారు.


ఈ చిత్రం తెరముందు

ఈ చిత్రం తెరముందు

సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు.


చిత్రం తెర వెనక...

చిత్రం తెర వెనక...

సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.


English summary
Allu Arjun's 'S/O Satyamurthy' audio release was held at Novotel Hotel, Hyderabad. The grand gala event was hosted by Anchor Suma at her usual best. The function kick started with Mega Family medleys and all the singers have entertained the audience by crooning live.
Please Wait while comments are loading...