»   » కలర్ ఫుల్: బన్నీ ‘S/O సత్యమూర్తి' ట్రైలర్ (వీడియో)

కలర్ ఫుల్: బన్నీ ‘S/O సత్యమూర్తి' ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ' సన్నాఫ్‌ సత్యమూర్తి'.సమంత, నిత్యమేనన్‌, అదాశర్మ , రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందించిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హోటల్‌ నోవాటెల్‌లో జరిగింది.

ఈ వేడుకలో భాగంగా చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులనే కాక సినిమా లవర్స్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఆ ట్రైలర్ ని మీరు ఈ క్రింద లింక్ లో చూడవచ్చు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుదేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆడియో పట్ల ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. ఈ సినిమాను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓ రేంజిలో రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ‘విలేవలే ఆస్తి' అనేది కాప్షన్ తో వస్తోంది.


జులాయి సినిమా తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సన్నాఫ్‌ సత్యమూర్తి మూవీపై ఆడియెన్స్‌‌తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. సినిమా ఆడియో పంక్షన్ జరిగి, ట్రైలర్ సైతం విడుదల కావడంతో.. విడుదల తేదీకి కౌంట్‌డౌన్‌ మొదలైనట్టే.


Allu Arjun's Son of Satyamurthy theatrical Trailer

ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ భారీ ధరకు ‘మా టీవీ' ఛానల్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఛానల్ వారు ఏకంగా రూ. 9.5 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. బన్నీ, త్రివిక్రమ్ సినిమాలకు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండటంతో ఇంత పెద్ద రేటు ఇచ్చి తీసికున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతకు లాభాలు వచ్చేశాయని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ మార్కెట్‌ రేంజ్‌తో పాటు త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతోనే బయ్యర్లు ఈ రేంజ్‌లో సినిమాను కొనుగోలు చేశారని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.


నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా రూపొందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తివిక్ర‌మ్ అత్తారింటికి దారేది చిత్రం త‌రువాత అల్లు అర్జున్ రేసుగుర్రం చిత్రం త‌రువాత చేస్తున్నందున‌ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి అన్నారు.


ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

English summary
Allu Arjun's 'S/O Satyamurthy' makers have unveiled the theatrical trailer of the film. Every frame look colourful with three beautiful heroines.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu