»   » టాప్ 7: అల్లు అర్జున్ s/o సత్యమూర్తి 50

టాప్ 7: అల్లు అర్జున్ s/o సత్యమూర్తి 50

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం యూరఫ్ లో ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం తాజాగా బాక్సాఫీసు సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రం వసూళ్ల పరంగా రూ. 50 కోట్ల మార్కును అందుకోవడమే ఇందుకు కారణం. అల్లు అర్జున్ కెరీర్లో రూ. 50 కోట్ల మార్కును అందుకున్న రెండో చిత్రం ఇదే.

అల్లు అర్జున్ గత చిత్రం ‘రేసు గుర్రం' కూడా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు, యావరేజ్ మౌత్ టాక్ వచ్చినప్పికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఆదరించడంతో సినిమా రూ. 50 కోట్ల మార్కును అందుకుందని అంటున్నారు. అల్లు అర్జున్ వరుస చిత్రాలు రూ. 50 కోట్ల మార్కును అందుకోవడంతో బన్నీ స్టార్ రేంజి పెరిగిందని అంటున్నారు.


Allu Arjun's Son Of Satyamurthy To Join 50 Crore Club

ఈ చిత్రం కేరళలోనూ విడుదలై మంచి వసూళ్లు సాధిస్తోంది. 'S/O సత్యమూర్తి' చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

English summary
Allu Arjun, who is currently enjoying a family trip in Europe, has a great news in store to party harder. His latest release Son Of Satyamurthy is racing towards 50 crore club and it would be the second 50 Cr film for the Stylish Star.
Please Wait while comments are loading...