»   »  ఎందుకంటే :చిరంజీవికి అల్లు అర్జున్ స్పెషల్ థాంక్స్.!

ఎందుకంటే :చిరంజీవికి అల్లు అర్జున్ స్పెషల్ థాంక్స్.!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వాయిస్ ఓవర్ విషయంలో అల్లు అర్జున్ చిరంజీవికి స్పెషల్ థాంక్స్ చెప్పారు. రుద్రమదేవి సినిమాలో అతి కీలకమైన గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నారు. ఆయన నటించిన చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పటం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అది బెస్ట్ ఛాయిస్ అని అన్నారు. అల్లు అర్జున్ ఏమన్నారో మీరే స్వయంగా చూడండి.

Sooo glad that chiranjeevi garu gave voice over for Rudhramadevi ! The best choice ! Really nice gesture from the King of Hearts !

Posted by Allu Arjun on 17 June 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘రుద్రమదేవి సినిమాకి చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. చెప్పాలంటే ది బెస్ట్ ఛాయస్ ఇది. ఎంతో మంచి హృదయం కలిగిన కింగ్ చేసిన ఓ మంచి పని' అని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రానా, అల్లు అర్జున్‌లు కీలక పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయంలో చిత్రం యూనిట్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.

Allu Arjun special Thanks to Chiranjeevi

ఈ చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ చెప్పారంటూ అందుకు సంబంధించిన ఫొటోను 'రుద్రమదేవి' చిత్ర అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. 'చారిత్రక వైభవమైన కథకు అసమానమైన మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌' అంటూ అందులో పేర్కొంది.

తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ‘రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్ కనిపిస్తారు. ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
Allu Arjun shared a post in facebook " Sooo glad that chiranjeevi garu gave voice over for Rudhramadevi ! The best choice ! Really nice gesture from the King of Hearts !"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu