»   » వీడియో తో ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ధాంక్స్(విత్ లింక్)

వీడియో తో ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ధాంక్స్(విత్ లింక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : తనను ప్రేమించి,అభిమానించి,తన ఎదుగులకు తోర్పడిన ఫ్యాన్స్ కు అల్లు అర్జున్‌ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. అల్లు అర్జున్ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ ఇటీవల 10 లక్షల లైక్స్‌ని అధిగమించిన సంగతి తెలిసిందే. ఇంతవరకు ఏ ఇతర తెలుగు హీరోకు ఈ విధంగా ఫేస్‌బుక్‌లో ఇంతటి ఫాలోయింగ్‌ తెచ్చుకోలేదు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాజాగా అభిమానులకు థాంక్స్‌ చెబుతూ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లో 50 సెకండ్ల నిడివిగల వీడియోను అప్‌లోడ్‌ చేశాడు. నెట్లో తనని ఇంతమంది అభిమానిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, మన రాష్ట్రంలోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ ప్రాంతాల అభిమానులకు, విదేశాల్లో వున్న అభిమానులకు ఈ సందర్భంగా థాంక్స్‌ చెబుతున్నానని బన్నీ అన్నాడు. అలాగే అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపాడు.

ఆ లింక్ ఇదే...

అల్లు అర్జున్ కి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దాంతో ఆయన ఏ ఇతర తెలుగు హీరో సాధించని రికార్డ్ ని ఫేస్ బుక్ లో సాధించారు. అతనికి ట్విట్టర్ ఎకౌంట్ లేకపోయినప్పటికీ తన సినీ, వ్యక్తిగత సమాచారాలని ఫేస్ బుక్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూంటారు. తాజాగా ఈ ఫేస్ బుక్ ఎక్కౌంట్ మిలియన్ లైక్ లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

ప్రస్తుతం బన్ని ప్రస్తుతం 'రేస్ గుర్రం' సినిమా షూటింగ్ పనులలో బిజీగా వున్నాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. శృతిహాసన్ హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. 'రేసు గుర్రం' పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నిర్మాత నల్లమలుపు బుజ్జి తెలియచేసారు. జనవరి 14,2014న తమ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నామని అన్నారు.

నల్లమలుపు బుజ్జి మాట్లాడుతూ..." మీరు అల్లు అర్జున్ ని పూర్తి స్ధాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో చూస్తారు. బన్ని కెరీర్ లో మొదటి సారి పూర్తి కామెడీ తో చేస్తున్న సినిమా ఇది. సంక్రాంతికి మా సినిమా భారీ ఎత్తున విడుదల చేస్తాం ," అన్నారు. శృతిహాసన్, సలోని హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి

English summary
Allu Arjun after Iddarammayilatho has been silent for long though he is racing on Race Gurram under Surender Reddy's direction. However he showed his power with his facebook likes reaching 10lakhs.Allu Arjun delighted fans by releasing a video in which he thanked fans in english for making it possible. He on Diwali day delighted fans cutting across regions in Andhra Pradesh, Malayalam and Tamil Nadu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X