»   » అరే అదే నంబర్... పవన్‌ను కాపీ కొట్టిన అల్లు అర్జున్

అరే అదే నంబర్... పవన్‌ను కాపీ కొట్టిన అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా క్యాంపులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య రిలేషన్స్ అంతంత మాత్రమే అన్న రూమర్ ఫిలింనగర్‌లో బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య పవన్ అభిమానులపై అల్లు అర్జున్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఉపయోగించిన బైక్ నంబర్ ఏపీ 27 జీఎస్ 2425. తాజాగా అల్లు అర్జున్ విడుదల చేసిన దువ్వాడ జగన్నాధం ఫస్ట్‌లుక్‌లోని బండి నంబర్ ఏపీ 16 ఈఏ 2425. చివరి నాలుగు నంబర్లు ఒకటే కావడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.

Allu Arjun uses similiar vehicle number which used by Pawan Kalyan in Gabbar Singh

ఈ నంబర్లను అల్లు అర్జున్ ఎందుకు ఉపయోగించాడు. పవన్‌కు ఇండస్ట్రీ రికార్డు హిట్‌ను ఇచ్చిన నంబర్ అల్లు అర్జున్‌కు కూడా మరో భారీ హిట్ ఇస్తుందా అనే ప్రశ్నలను అభిమానులు సంధిస్తున్నారు. వరుస విజయాలతో అల్లు అర్జున్ మంచి ఊపు మీద ఉన్నాడు. సరైనోడు హిట్‌తో తన స్టామినాను చాటాడు. డిఫెరెంట్ ‌లుక్‌తో విడుదలైన డీజే ఫస్ట్‌లుక్ కూడా భారీ అంచనాలు పెంచింది.

English summary
AP 27 GS 2425 vehicle number used by pawan Kalyan. the Allu Arjun uses similiar vehicle number which used in Pawan Kalyan in Gabbar Singh. Its now debate in Social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu