»   »  అల్లు అర్జున్ పిలుపుకి ఎంత మంది స్పందిస్తారో

అల్లు అర్జున్ పిలుపుకి ఎంత మంది స్పందిస్తారో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు,మళయాళి పరిశ్రమలలో సమానంగా గుర్తింపు పొందుతున్న హీరో అల్లు అర్జున్. అతనికి తాజాగా మళయాళంలో సినిమా చేయాలనే కోరిక పుట్టింది. ఈ మేరకు అక్కడి ఫిల్మ్ మేకర్స్ కు పిలుపు ఇచ్చారు. అక్కడ మీడియాని ఉద్దేశించి మాట్లాడుతూ... మళయాళి సినిమాని చాలా మంది యువ ఫిల్మ్ మేకర్స్ మారుస్తున్నారు. వారందరికీ చెప్తున్నా...రండి నన్ను ఎప్రోచ్ కండి...నాకు మళయాళంలో స్ట్రైయిట్ ఫిల్మ్ చేయాలని ఉంది. ఇక్కడ నా ఫ్యాన్స్ కోసం అని అన్నారు. మరి ఈ పిలుపుకు ఎంతమంది స్పందించి ఆయన్ను ఎప్రోచ్ అవుతారో చూడాలి.

" అలాగే నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాం, ఎందుకంటే మరో ప్రాంతంలో అక్కడి వారి చేత గుర్తింపబడి, ఇష్టపడటం అనేది మామూలు విషయం కాదు, నేను మళయాళిని కాకపోయినా, ఇక్కడ వారు ఊహించని,నమ్మలేని ప్రేమను నా మీద కురిపిస్తున్నారు. ఇది ఓ గౌరవంగా భావిస్తున్నా. దాంతో నేను కేవలం తెలుగు కుర్రాడిని కాదు, ఇండియన్ ని అనే విషయం గుర్తుకు వస్తోంది ," అని భావోద్వేగంగా అన్నారు.

Allu Arjun wants to act in a Malayalm film

ఇక "నేను ఆర్య షూటింగ్ కు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. ఇక్కడ ఓ సమాన్యుడులా అంతటా తిరిగాను. ముమ్మట్టి, మోహన్ లాల్ నా ఫేవరెట్ యాక్టర్స్. ," అని చెప్పుకొచ్చారు. రేసుగుర్రం చిత్రం విజయంతో ఒక ఊపు ఊపిన అల్లు అర్జున్‌కు మలయాళంలో మంచి డిమాండే ఉంది. తాజాగా అల్లు అర్జున్‌ నటించిన పాత చిత్రాలను అక్కడ డబ్‌ చేసి వదులుతున్నారు. అక్కడ పిల్లల నోట్‌ బుక్కులపై కూడా అల్లు అర్జున్‌ బొమ్మలు ముద్రించి అమ్ముతున్నారంటే అల్లు అర్జున్‌కున్న డిమాండ్‌ ఏపాటిదో అర్థమైవుంటుంది.రీసెంట్‌గా రేసుగుర్రం చిత్రాన్ని డబ్‌చేసి అక్కడ రిలీజ్‌ చేశారట. ఆ చిత్రం అక్కడ మంచి కలెక్షన్లు రాబడుతోంది.

అల్లు అర్జున్‌ సినిమాలు కేరళ లో కూడా విడుదలై అక్కడా మంచి వసూళ్లను సాధిస్తున్న సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యలో ఆయన హీరోగా తెరకెక్కి,విడుదలైన తాజా చిత్రం 'రేసుగుర్రం' సైతం మళయాళంలోకి వెళ్లింది. మళయాళ టైటిల్... లక్కీ ...ది రేసర్. పిఆర్ టి ఎంటర్ ప్రైజస్ బ్యానర్ పై మళయాళంలో రిలీజ్ అయ్యింది. శ్రుతిహాసన్‌ హీరోయిన్. సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలందించారు. ఇక్కడ హిట్ టాక్ తెచ్చుకోవటంతో అక్కడా మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. E4 ఎంటర్ట్నైమెంట్ వారు ఈ చిత్రాన్ని అక్కడ పంపిణీ చేస్తున్నారు.

English summary
Allu Arjun said.. " A lot of young filmmakers are changing the face of Malayalam cinema...I'd like to tell them to please approach me. I'd like to act in a Malayalam film sometime for my fans," he added.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu