»   » భార్య లేని లోటు భయంకరం.. దిల్ రాజును చూసి షాక్ అయ్యా..

భార్య లేని లోటు భయంకరం.. దిల్ రాజును చూసి షాక్ అయ్యా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు లాంటి వరుస విజయాలతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ మరోసారి సక్సెస్‌ను సాధించేందుకు దువ్వాడ జగన్నాథం చిత్రంతో సిద్ధమైనాడు. గోపిసుందర్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఇటీవల రిలీజైన టీజర్‌కు అనూహ్య స్పందన లభిస్తున్నది. ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రంలో స్టైలిష్ స్టార్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ఆ చిత్ర విశేషాల గురించి అల్లు అర్జున్ వివరిస్తూ..

చాలా ప్రత్యేకమైనది

చాలా ప్రత్యేకమైనది

దువ్వాడ జగన్నాథం చిత్రం నాకు, నిర్మాత దిల్ రాజుకు ప్రత్యేకమైనది. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఇది మూడోది. దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించిన ఆర్య చిత్రం ఇద్దరికి రెండోది. ఆ తర్వాత పరుగు చిత్రం మా కెరీర్‌లో ఆరోది. నేను 17 సినిమాలు చేస్తే.. ఆయన 25 చిత్రాలు చేశారు. ఓ ల్యాండ్ మార్క్ ఉన్న చిత్రాన్ని నాతో తీయాలని ఆయన నిర్ణయం తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది.


అందరం షాక్ అయ్యాం

అందరం షాక్ అయ్యాం

ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడే దిల్ రాజు భార్య చనిపోయారు. అప్పుడు అందరం షాక్ అయ్యాం. ఆ ఘటన తర్వాత దిల్ రాజు ఎలా ఉంటారో.. ఆ విషాదం నుంచి త్వరగా బయటపడుతారో లేదో అనే ఆందోళనకు గురయ్యా. దిల్ రాజు కాబట్టి త్వరగా ఆ ఘటన నుంచి తేరుకొన్నారు. మరోకరు అయితే చాలా కష్టంగా ఉండేది.


భార్య లేని లోటు

భార్య లేని లోటు

ఎన్నో ఏళ్లు అనుబంధం ఉన్న భార్య ఇంట్లో లేదనే ఆలోచన నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఆ మానసిక పరిస్థితి మనిషిని కుదురుగా ఉండనివ్వదు. ఆయన మాతో ఉన్నంత సేపు అలాంటి ఫీలింగ్‌ను బయట పెట్టేవారు కాదు. షూటింగ్‌కు గ్యాప్ రానీయలేదు. మాకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్నీ దగ్గరుండి చూసుకొన్నారు.


ప్రేమ, తపన చూశాను..

ప్రేమ, తపన చూశాను..

సినిమా పనుల్లో పడి ఆయన ఆ విషాదం నుంచి బయటపడ్డారనుకొంటాను. సినిమా అంటే ఆయనకు ఎంత ప్రేమ, తపన ఉందోననే విషయాన్ని స్వయంగా చూశాను అని అల్లు అర్జున్ అన్నారు.


చాలా కసరత్తు చేశాను

చాలా కసరత్తు చేశాను

బ్రహ్మణ కుర్రాడిలా మాట్లాడేందుకు చాలా కసరత్తు చేశాను. రోజు కొంతమంది బ్రహ్మణులను ఇంటికి పిలిపించుకొని వారు మాట్లాడే భాష, తీరును అలవాటు చేసుకొన్నాను. అలా చేయడం వల్ల పాత్రను చాలా ప్రభావవంతంగా పోషించాను. అది తెరమీద కనిపిస్తుంది. స్వయంగా దర్శకుడు హరీష్ శంకర్ బ్రహ్మణుడు కావడం వల్ల నాకు పని చాలా సులభమైంది అని అల్లు అర్జున్ చెప్పారు.


ఫ్యాన్స్ కోసం లుంగీ

ఫ్యాన్స్ కోసం లుంగీ

కేరళ ఫ్యాన్స్ కోసం ఈ సినిమాలో లుంగీ కట్టుకొన్నాను. కేరళ ఫ్యాన్స్‌ను ఎప్పుడు కలిసినా వాళ్లు మీరు లుంగీ కట్టుకోండి సార్ అని అడిగేవారు. ఎప్పట నుంచో కట్టుకోవాలని అనుకొంటున్నాను. ఈ సినిమాతో లుంగీ కోరిక తీరింది అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.


కొత్తగా ఉండాలి.. ప్రేక్షకుడిని మెప్పించాలి..

కొత్తగా ఉండాలి.. ప్రేక్షకుడిని మెప్పించాలి..

ప్రతీ సినిమా కొత్తగా ఉండాలి. ప్రేక్షకుడిని మెప్పించాలి. నన్ను నమ్మిన నిర్మాత బాగుండాలి అని కోరుకొంటాను. నిర్మాత కుమారుడిగా మార్కెట్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తాను. పరిశ్రమలోని మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తుంటాను అని ఆయన తెలిపారు.English summary
Before release of Duvvada Jagannadham, stylish star Allu arjun shares his view about the movie. Allu Arjun said that they were shocked after Dil Raju's wife demise. But Dil Raju come out well in very short span.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu