»   » స్నేహ గర్భవతే, బన్నీ ఇంకా తండ్రికాలేదు: అల్లు అరవింద్

స్నేహ గర్భవతే, బన్నీ ఇంకా తండ్రికాలేదు: అల్లు అరవింద్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Allu Arvind
హైదరాబాద్: అల్లు అర్జున్ తండ్రయ్యాడని, ఆయన భార్య స్నేహారెడ్డి సంక్రాంతి పండగరోజు జనవరి 15న ఆడబిడ్డకు జన్మనిచ్చిందని...ఓ ప్రముఖ తెలుగు పత్రికకు సంబంధించిన వెబ్ సైట్ వార్త ప్రచురించడం సంచలనం సృష్టించింది. సదరు తెలుగు డైలీ ప్రచురించిన ఆ వార్త వివరాలను నిన్న సాయంత్రమే వన్ ఇండియా పాఠకుల దృష్టి తెచ్చాం.

అయితే ఈ వార్తలు కేవలం రూమర్లు మాత్రమే అని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఈ విషమై ఆయన స్పందిస్తూ...తన కోడలు స్నేహారెడ్డి గర్భవతిగా ఉన్న మాట వాస్తవమే అని, అయితే డెలివరీ కావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని, ఆదారం లేకుండా ఎలాంటి వార్తలు ప్రచురించవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేసారు.

పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డిల వివాహం మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

English summary
Allu Arjun’s wife giving birth to a female child...news turned out to be a wrong news. It’s true that Allu Arjun’s wife is pregnant now, but the news of her giving birth to a baby is completely false.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu