»   » ఆ కారణంతోనే, చిట్టా ఉంది: ఆ 15మంది నటీనటులకు అల్లు అరవింద్ హెచ్చరిక

ఆ కారణంతోనే, చిట్టా ఉంది: ఆ 15మంది నటీనటులకు అల్లు అరవింద్ హెచ్చరిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా పరిశ్రమలో కొంతమంది యంగ్ స్టార్స్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని, ఇది సరికాదని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రగ్స్ మాఫియాను అరికట్టడం సినిమా పరిశ్రమ సామాజిక బాధ్యత అని అల్లు అరవింద్ చెప్పారు. హైదరాబాదులో రేవ్ పార్టీ కల్చర్ బాగా పెరిగిందన్నారు.

ఇండస్ట్రీలో కొంతమంది కొత్త తరం నటులు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారన్నారు. డ్రగ్స్ పై యువత మొగ్గు చూపవద్దని విజ్ఞప్తి చేశారు. కొంతమంది వల్లే మొత్తం సినిమా పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందన్నారు.

డ్రగ్స్‌తో ఎవరు కూడా తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటోందని చెప్పారు.

పదిపదిహేను మంది డ్రగ్స్ వాడుతున్నారని..

పదిపదిహేను మంది డ్రగ్స్ వాడుతున్నారని..

పరిశ్రమలో పదిపదిహేను మంది నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలుస్తోందని అల్లు అరవింద్ అన్నారు. ఆ పదిహేను మందికి తాము చెప్పేది ఒక్కటేనని.. మీరు పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

Allu Arjun's Next Movie Naa Peru Surya Naa Illu India Launched
మీ రికార్డులన్నీ ఉన్నాయి

మీ రికార్డులన్నీ ఉన్నాయి

మీరు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం ఎవరికీ తెలియదని భావిస్తున్నారని, కానీ అది పొరపాటు అన్నారు. మీకు సంబంధించిన ప్రతి అంశం ప్రభుత్వం ముందు ఉందని చెప్పారు. డ్రగ్స్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరి వద్ద ఎలా తీసుకున్నారన్న రికార్డులు ఉన్నాయన్నారు.

ఆ ఒక్క కారణంతోనే..

ఆ ఒక్క కారణంతోనే..

అయితే, కేవలం భవిష్యత్తును నాశనం చేయకూడదన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని ఉపేక్షిస్తున్నారని, జరిగిందేదో జరిగిపోయిందని, ఇకపై అలాంటి వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. సినిమా పరిశ్రమలో ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉండాలని, పరిశ్రమకు చెడ్డపేరు తీసుకు రావొద్దన్నారు. లేదంటే పరిశ్రమ నుంచి తప్పుకోవాలన్నారు.

చెడ్డపేరు తీసుకు రాకండి

చెడ్డపేరు తీసుకు రాకండి

కొంతమంది డ్రగ్స్ తీసుకొని, సినిమా పరిశ్రమకు చెడ్డపేరు తీసుకు రావొద్దని సురేష్ బాబు అన్నారు. ఈ అంశాన్ని సున్నితంగా పరిష్కరించాలని సూచించారు.

మూలాలు గుర్తించాలి

మూలాలు గుర్తించాలి

దీనికి సంబంధించి సినీ ప్రముఖులు మూలాలను గుర్తించాల్సిన అవసరం ఉందని సురేష్ బాబు చెప్పారు. అవసరమైతే అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. డ్రగ్స్ ఓ సామాజిక రుగ్మత అని, అది ఏ రూపంలోను ఉండవద్దని ఆకాంక్షించారు.

English summary
Tollywood producers Allu Arvind and Suresh Babu suggested young generation to avoid drugs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu