»   » ఎన్టీఆర్ 12, నేనూ 12: రాఘవేంద్రుడికి అల్లు పురస్కారంలో చిరు (ఫోటోస్)

ఎన్టీఆర్ 12, నేనూ 12: రాఘవేంద్రుడికి అల్లు పురస్కారంలో చిరు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు దివంగత అల్లు రామలింగయ్య జాతీయ పురస్కార ప్రదాన కార్యక్రమం అమీర్‌పేటలోని సత్యసాయి నిగమాగమంలో బుధవారం గ్రాండ్ జరిగింది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు ఈ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, పరుచూరి వెంకటేశ్వరరావుల, అశ్వినీదత్, గబ్బర్ సింగ్ నిర్మాత శరత్ మరార్ లతో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఏపీ మంత్రులు కామినేని, గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ...‘అల్లు రామలింగయ్య గారికి, మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు' అని అతనికి అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. తన మనసుకు చాలా దగ్గరైన వ్యక్తి రాఘవేంద్రరావు అని, ఆయన తీసిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ అల్లు రామలింగయ్య గారు నటించారని తెలిపారు.చిరంజీవి చెప్పుకొచ్చాడు.

రాఘవేంద్రరావు ఎన్టీఆర్ కి ‘అడవి రాముడు', తనకి ‘అడవిదొంగ' వంటి సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చాడని తెలుపుతూ, రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ 12 సినిమాలు చేసాడని, నేను కూడా అతని దర్శకత్వంలో ఇప్పటివరకు 12 సినిమాల్లో నటించానని చిరంజీవి తెలిపాడు.

దర్శకుడు రాఘవేంద్రరావును సన్మానించడం అంటే అల్లు రామలింగయ్యకి ఘన నివాళులు అర్పించడమేనని చిరంజీవి తెలిపాడు. ‘అల్లు రామలింగయ్యకు నేను వీరాభిమానిని. ఆయనలో భిన్న పార్శ్వాలున్నాయి. అల్లు రామలింగయ్య నటుడిగా, వైద్యుడి గా మాత్రమే మనకు తెలుసు,కానీ ఆయన గొప్ప మానవతావాది అనే విషయం కొంత మందికి మాత్రమే తెలుసుని తెలిపారు. రామకృష్ణ పరమహంస బోధనలను నిత్యజీవితంలో అవలంబించిన గొప్పవ్యక్తి, గాంధీజీ స్పూర్తితో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారన్నది చాలా మందికి తెలియదు అని చిరంజీచి చెప్పకొచ్చారు.

స్లైడ్ షోలో ఫోటోస్....

పురస్కారం

పురస్కారం


ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం అందుకున్నారు.

ప్రముఖులు

ప్రముఖులు


ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, పరుచూరి వెంకటేశ్వరరావుల, అశ్వినీదత్, గబ్బర్ సింగ్ నిర్మాత శరత్ మరార్ లతో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఏపీ మంత్రులు కామినేని, గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.

సన్మానం

సన్మానం


దర్శకుడు రాఘవేంద్రరావును సన్మానించడం అంటే అల్లు రామలింగయ్యకి ఘన నివాళులు అర్పించడమేనని చిరంజీవి తెలిపాడు.

వీరాభిమానిని

వీరాభిమానిని


అల్లు రామలింగయ్యకు నేను వీరాభిమానిని అని చిరంజీవి తెలిపారు.

అల్లు రామలింగయ్య

అల్లు రామలింగయ్య


అల్లు రామలింగయ్య నటుడిగా, వైద్యుడి గా మాత్రమే మనకు తెలుసు,కానీ ఆయన గొప్ప మానవతావాది అనే విషయం కొంత మందికి మాత్రమే తెలుసుని తెలిపారు. రామకృష్ణ పరమహంస బోధనలను నిత్యజీవితంలో అవలంబించిన గొప్పవ్యక్తి, గాంధీజీ స్పూర్తితో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారన్నది చాలా మందికి తెలియదు అని చిరంజీచి చెప్పకొచ్చారు.

English summary
K Raghavendra Rao honoured with the prestigious Allu Ramalingaiah National Award.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu