రెండుసార్లు పరీక్ష చేయించుకున్నా.. కరోనాపై అల్లు శిరీష్ ట్వీట్ వైరల్
ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో కరోనా వైరస్ సృష్టిస్తోన్న ప్రకంపనల గురించి అందరికీ తెలిసిందే. వరుసగా మెగా హీరోలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, వరుణ్ తేజ్ కరోనా బారినపడ్డారు. రామ్ చరణ్‌తో పాటు ఉపాసన కూడా క్వారంటైన్‌లో ఉంటోంది. తనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా అల్లు శిరీష్ కూడా తనకు వచ్చిన కరోనా ఫలితం గురించి చెబుతూ నివారణ చర్యలు కూడా చెప్పుకొచ్చాడు.
ఇప్పటికి రెండు సార్లు పరీక్షలు చేయించుకున్నాను.. నెగెటివ్ వచ్చింది.. ఈ విషయం మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.. రెండుసార్లు నెగెటివ్ అనే వచ్చింది. సాధారణంగా కోవిడ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. నేను పెళ్లికి వెళ్లాను.. బయటకు అవుట్ డోర్‌లో ప్రయాణించాను.. ప్రతీరోజూ వంద మందితో సెట్‌లో షూటింగ్ చేస్తుంటాను..

నేను మాస్క్ ధరిస్తాను.. శానిటైజర్ వాడుతుంటాను.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. కానీ జనాలతో తిరగడం అనేది మానడం కుదరని పని.. కానీ నన్ను రక్షించేది మాత్రం ఆయుర్వేదం.. కొంత అదృష్టం. మనిషి ఈ ప్రపంచాన్ని ఇతర ప్రాణులతో కలిసి పంచుకుంటున్నాడు. ఇతర ప్రాణులతో మనకు వచ్చే రోగాలను నయం చేసేందుకు పురాతన కాలంలోనే ఎన్నో నివారణ మార్గాలు, మందులను కనిపెట్టారు. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు మాస్క్‌లు వాడటమే కాకుండా.. ఆయుర్వేద పద్దతులు కూడా వాడండంటూ అల్లు శిరీష్ అందరినీ కోరాడు.


Click it and Unblock the Notifications











