»   » బాలయ్యతో డాన్స్ గురించి అల్లు శిరీష్ ఇలా...

బాలయ్యతో డాన్స్ గురించి అల్లు శిరీష్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ , అల్లుశిరీష్ కలిసి డాన్స్ చేయటమనేది అరుదైన సంగతే. ఈ ముచ్చట చిరంజీవి 60 వ పుట్టిన రోజు వేడుకలో జరిగింది. బాలకృష్ణతో కలిసి అల్లు శిరీష్ చాలా సేపు గడిపారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ తన సోషల్ నెట్ వర్కింగ్ పేజిలో తెలియచేసారు.

Myself with Balayya garu at Chiranjeevi garu's 60th birthday. He was very friendly. Mingled and danced with all of us.. We personally bonded over being fellow Geminis. Haha!

Posted by Allu Sirish on 25 August 2015


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుక ఎంత గ్రాండ్ గా జరిగిందో అందరికీ తెలసిందే. పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమల నుండి ప్రముఖులు హాజయ్యారు. సల్మాన్ ఖాన్, జయా బచ్చన్, కమల్ హాసన్, అంబరీష్, శతృజ్ఞ సిన్హా లాంటి బిగ్ స్టార్లతో పాటు ప్రముఖులు హాజరయ్యారు.

Allu Sirish excited to dance with Balayya

చిరంజీవితో పాటు బాలయ్య, నాగార్జున లాంటి స్టార్స్ డాన్స్ చేసారు. బర్త్ డే పార్టీలో పాల్గొన్న స్టార్లంతా కూడా చిరంజీవితో పాటు స్టెప్స్ వేసారు. ఈ వేడుకకు భర్తతో పాటు హాజరైన మంచు లక్ష్మి కూడా చిరంజీవితో కలిసి డాన్స్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా విడుదల చేసింది.

చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు హాజరైన సూర్యతో కలిసి దిగిన సెల్పీలను కూడా మంచు లక్ష్మి పోస్టు చేసింది. చిరంజీవి బర్త్ డే పార్టీలో మంచు లక్ష్మి చాలా సంతోషంగా గడిపినట్లు, పార్టీ ఎంజాయ్ చేసినట్లు ఈ ఫోటోలు చూస్తే స్పష్టమవుతోంది.

English summary
Allu Sirish posted a pic of him along with Balakristna and wrote “Myself with Balayya garu at Chiranjeevi garu's 60th birthday. He was very friendly. Mingled and danced with all of us.. We personally bonded over being fellow Geminis. Haha!”
Please Wait while comments are loading...