»   » అల్లు శిరీష్- మోహన్ లాల్ కాంబినేషన్లో సినిమా!

అల్లు శిరీష్- మోహన్ లాల్ కాంబినేషన్లో సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మల్లూవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడా క్రేజ్ ను దక్కించుకోబోతున్నాడు.. అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్. ఇటీవలే శ్రీరస్తు శుభమస్తు వంటి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ చిత్రంతో మంచి ఊపు మీదున్న శిరీష్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నాడు.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి స్క్రీన్ చేసుకోబోతున్నాడు అల్లు శిరీష్. అది కూడా ఓ యూనివర్శల్ సబ్జెక్ట్ ద్వారా.... ఓ మంచి పాత్రతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని శిరీష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోహన్ లాల్ కథానాయకుడిగా 1971 బియాండ్ బోర్డర్స్ అనే చిత్రం రూపొందించనున్నారు.

Allu Sirish Making Malayalam debut in Mohanlal film

ఈ చిత్రంలోనే అల్లు శిరీష్ ట్యాంక్ కమాండర్ గా కీలక రోల్ ప్లే చేయనున్నారు. మలయాళ క్రేజీ డైరెక్టర్ మేజర్ రవి ఈ చిత్రానికి దర్శకుడు. మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.... మోహన్ లాల్ గారితో కలిసి నటించే అవకాశం తొలి సినిమాకే రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టేందుకు ఇదే సరైన సబ్జెక్ట్ అని భావిస్తున్నా, 1971 బియాండ్ బోర్డర్స్ పేరుతో రూపొందించబోయే ఈ చిత్రంలో ట్యాంక్ కమాండర్ గా ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నాను. ఈ చిత్ర కథ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా రూపొందించట్లేదు. హ్యూమన్ డ్రామా, ఎమోషన్స్ తో కూడిన చిత్రమిది. ప్రతీ భారతీయుడు గర్వపడే రీతిలో ఉండే ఈ చిత్రాన్ని కోరుకుంటాడని ఆశిస్తున్నాను. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. అని అన్నారు.

English summary
Allu Sirish who tasted super hit with Srirastu Subhamastu is riding high with confidence. As we all know his brother Stylishstar Allu Arjun is the super star among all Telugu heroes in Malayalam with immense craze in Malluwood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu