»   » అల్లు శిరీష్ ఏదో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు, ఈ న్యూస్ చూస్తే అదే డౌట్

అల్లు శిరీష్ ఏదో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు, ఈ న్యూస్ చూస్తే అదే డౌట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీసెంట్ గా 'శ్రీరస్తు శుభమస్తు' అంటూ హిట్ కొట్టిన అల్లు శిరీష్ తన తదుపరి చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ జానర్ లో చేయటానికి ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు ఆయన అఫీషియల్ గా ప్రకటన చేసారు. డైరక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో తన కొత్త సినిమా ఉంటుందని అల్లు శిరీష్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.

సందీప్ కిషన్ తో చేసిన 'టైగర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్, ప్రస్తుతం నిఖిల్‌తో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా!' అన్న సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ లో ఉండగానే ఈ కొత్త చిత్రాన్ని ఓకే చేయించుకున్నారు. విభిన్నంగా చిత్రం ఉండాలని, జానర్ మార్చి వచ్చిన ఈ సబ్జెక్టు కు అల్లు శిరీష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వాస్తవానికి శ్రీరస్తు శుభమస్తు చిత్రం తర్వాత మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తానని ఎనౌన్స్ చేసారు. కానీ ఆ ప్రాజెక్టును హోల్డ్‌లో పెట్టారు. చాలా భారీ తనంతో కూడుకున్న కథ కావడంతో ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం చాలా టైం పడుతుందని.. అందుకే ఓ ఆర్నెల్లు హోల్డ్‌లో పెట్టి వేరే సినిమా చేస్తానని చెప్తున్నారు శిరీష్.

ఇక ఈ చిత్రం వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని.. గీతా ఆర్ట్సే నిర్మిస్తుందని సమాచారం. తమిళంలో 'అపూచి గ్రామం' అనే సైన్స్ ఫిక్షన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు వీఐ ఆనంద్. ఆ సినిమా అక్కడ ఆడలేదు. తర్వాత తెలుగులో హృదయం ఎక్కడ ఉన్నది అనే చిత్రంతో తెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత 'టైగర్'సినిమా చేసారు. ఇప్పుడు నిఖిల్ తో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చేస్తున్నారు.

English summary
"On this auspicious Dussera day, started work on my next film : a science fiction thriller with Director VI Anand. Excited! Wish us good luck", Allu Sirish tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu