»   » వరసలు మరిచిన అల్లువారబ్బాయ్.... మామని కూడా మరిచి ఇలా

వరసలు మరిచిన అల్లువారబ్బాయ్.... మామని కూడా మరిచి ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు రామలింగయ్య కుమార్తె అయిన సురేఖను మెగాస్టార్ చిరు వివాహమాడడంతో రెండు కుటుంబాల మధ్య బంధుత్వం మొదలైంది. ప్రస్తుతం ప్రముఖ నిర్మాతగా ఉన్న అల్లు అరవింద్ చిరంజీవికి బామ్మర్ది. అంటే ఇప్పుడు హీరోలుగా వెలుగుతున్న అల్లు అర్జున్, అల్లు శిరీష్‌‌కు చిరంజీవి మావయ్య అవుతారు. వీళ్లిద్దరికీ చిరంజీవి ఏమవుతారో.. ఆయన సొంత తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా అదే వరుస అవుతారు.

అంటే అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరోలిద్దరికీ పవన్ మావయ్యే అవుతాడు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అయినా ఎందుకు ఇప్పుడు చెప్తున్నాం అనే కదా అయోమయం. మీకు తెలిసిన విషయం అల్లు శిరీష్ కి తెలియదు మరి పాపం మరీ ఎగ్జైట్ మెంట్ లో అల్లువారి చిన్నబ్బాయ్ మామని కాస్తా బాబాయ్ ని చేసేసాడు. పవన్ కళ్యాణ్ ని మామా అని పిలవాల్సింది పోయి బాబాయ్ అనేసాడు....

allu sirish says pawan kalyan as Babai

'కాటమరాయుడు' టీమ్‌కు విషెస్‌ చెబుతూ.. ''సూరీడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. కల్యాణ్‌ బాబాయ్‌కు, శరత్‌ మరార్‌కు, దర్శకుడు డాలీకి నా శుభాకాంక్షలు.'' అని శిరీష్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను ఒకటికి రెండు సార్లు చదివిన నెటిజన్లు ఇంత కన్ ఫ్యూజ్ మాస్టరా ఈ పిల్లోడు అంటూ నవ్వుకుంటున్నారు. 'అల్లు శిరీష్‌కు పవన్ మావయ్య అవుతారు కదా.. మరి బాబాయ్ అని ఎందుకు పిలిచాడు?' అంటూ అక్కడే అడిగేస్తున్నారు కూడా.

శిరీష్‌కు వరుసలు తెలీక అలా పిలిచాడో.. లేక రామ్ చరణ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టటం వల్ల చరణ్ పిలిచినట్టే అనేసాడా, ఇంగ్లీష్ మీడియం చదువులవల్ల మామయ్యా బాబాయ్ ని అంకుల్ అనే అనటం అలవాటయ్యి తెలుగులో పోస్ట్ చేసేటప్పుడు అలా పెట్టి ఉంటాడా? అనే విషయం తెలియాలంటే.. శిరీష్ మళ్ళీ ఆన్లైన్లోకి వచ్చి ఆ ట్వీట్ ని మళ్ళీ చూసుకోవాలి మరి.

English summary
"Sooridalle occhadu mana andari #Katamarayudu! Wishing Kalyan babai, sharrath_marar & whole unit ATB! PawanKalyan" Tweets allu sirish.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu