twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ, చరణ్‌కు ఇచ్చారు... నేను అడిగితే చెప్పుతో కొడతా అన్నారు: అల్లు శిరీష్

    |

    Recommended Video

    Allu Sirish Speech About His Father Aravind at ABCD Movie Pre Release Event || Oneindia Telugu

    అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న 'ఏబీసీడీ' మూవీ మే 17న విడుదలకు సిద్ధమైంది. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. మెగా బ్రదర్ నాగబాబు ఇందులో అల్లు శిరీష్ కు తండ్రి పాత్రలో నటించారు. మాస్టర్ భరత్ హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించబోతున్నారు. సురేష్ బాబు సమర్పణలో బిగ్ బెన్ సినిమాస్ యశ్ రంగినేని‌తో సంయుక్తంగా మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో మధుర శ్రీధర్ నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. మూవీ ప్రమోషన్లో భాగంగా సోమవారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ ఆసక్తికరంగా ప్రసంగించారు.

    రామ్ చరణే ఈ సినిమా చేయమన్నారు

    రామ్ చరణే ఈ సినిమా చేయమన్నారు

    నన్ను ఈ సినిమా చేయాలని రికమండ్ చేసింది నా కజిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని శిరీష్ తెలిపారు. ‘ఒక్క క్షణం' సినిమా సమయంలో అనుకోకుండా చరణ్ ఇంటికి వెళ్లినపుడు తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే చర్చ జరిగిందని, ఆ సమయంలో ఈ మలయాళ చిత్రం చేస్తే బావుంటుందని, నీకు బాగా సూటవుతుందని చరణ్ సూచించారని, సరైన దర్శకుడు దొరక్క చేయడం కాస్త ఆలస్యమైందన్నారు.

    నా పర్సనల్ లైఫ్ కథలా అనిపించింది

    నా పర్సనల్ లైఫ్ కథలా అనిపించింది

    ఈ సినిమా చూస్తున్నపుడు నా పర్సనల్ లైఫ్ కథలా అనిపించింది. హీరో, ఫాదర్ పాత్రలకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. రెండు సార్లు నవ్వుకున్నాను, మా నాన్నగారు గుర్తుకొచ్చారు. సినిమాలో తండ్రి తన కొడుకు ప్రయోజకుడు కాలేదని, వీడిని మంచి దారిలో పెట్టాలని తపన పడుతుంటాడు... అది చూసినపుడు మా నాన్న నా గురించి తపన పడటం గుర్తుకొచ్చిందని శిరీష్ తెలిపారు.

    మా నాన్న చెప్పుతో కొడతా అన్నారు

    మా నాన్న చెప్పుతో కొడతా అన్నారు

    నాకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్లాను. బన్నీకి, చరణ్‌కు 21 ఏళ్ల వచ్చినపుడు కారు కొనిచ్చారు... ఇపుడు నాకు కూడా కారు కావాలని అడిగితే.. ఏం కారు కావాలి అన్నపుడు స్పోర్ట్స్ కారు కావాలన్నాను. మా నాన్నకు కోపం వచ్చి చెప్పుతో కొడతా అన్నారు. నీ వయసు కుర్రోళ్లు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడుకోవడం, 2 వీలర్ మీద తిరుగుతూ జాబ్ చేసుకుంటున్నారు. నీకు కారు కొనివ్వడమే ఓ లగ్జరీ.. అలాంటిది స్పోర్ట్స్ కారు కావాలా? డబ్బు విలువ తెలుసుకో అని చివాట్లు పెట్టినట్లు శిరీస్ గుర్తు చేసుకున్నారు

    నా సొంత డబ్బుతో కారు కొన్నా

    నా సొంత డబ్బుతో కారు కొన్నా

    నాన్న తిట్టినపుడు ఈ ఫాదర్స్ అంతా ఇంతే అనిపించింది. ఆ తర్వాత మూడేళ్ల తర్వాత నేను కష్టపడి సంపాదించి కారు కొనుక్కున్నాను. ఆ రోజు మా నాన్న అలా తిట్టి ఉండక పోతే నేను డబ్బు విలువ తెలుసుకునే వాడిని కాదు. సొంత డబ్బుతో మనం ఏది కొనుక్కున్నా ఆ కిక్కు మరోలా ఉంటుందన్నారు.

    ఈ సినిమా మా నాన్నకు అంకితం

    ఈ సినిమా మా నాన్నకు అంకితం

    ఈ చిత్రంలో నాగబాబుగారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. కానీ నా రియల్ లైఫ్ ఫాదర్ చిన్నపుడు చాలా స్ట్రిక్టుగా ఉండేవారు. చాలా సార్లు బెల్టుతో కొట్టడం, చేతికి ఏది దొరికితే దాంతో కొట్టడం చేశాడు. ఆయన ఎప్పుడూ ఒక విషయం చెప్పేవారు. కొడుకుగా నా ఆస్తి మాత్రమే కాదు... నా విలువలు కూడా పంచుకో అనేవారు. అందుకే ఈ సినిమాను మా నాన్నకు అంకితం చేస్తున్నాను.

    English summary
    Allu Sirish Speech about his father Aravind at ABCD Movie Pre Release Event. .#ABCD - American Born Confused Desi". Starring Allu Sirish, Rukshar Dhillon,Nagendra Babu, Master Bharath, Kota Srinivasa Rao.Directed by Sanjeev Reddy.Produced by Madhura Sreedhar Reddy & Yash Rangineni.Music by Judah Sandhy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X