»   » చైతూ తల్లి స్థానం ఇస్తాడా?...అమల అక్కినేని ఆసక్తికర జవాబు!

చైతూ తల్లి స్థానం ఇస్తాడా?...అమల అక్కినేని ఆసక్తికర జవాబు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ నాగ చైతన్య, అఖిల్....ఇద్దరికీ తండ్రి నాగార్జునే అయినా, వీరి తల్లలు వేరనే సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మితో నాగార్జున మొదటి వివాహం జరుగ్గా వీరికి నాగ చైతన్య జన్మించాడు. లక్ష్మితో విడిపోయిన తర్వాత తన సహ నటి అమలను నాగార్జున రెండో వివాహం చేసుకున్నారు. వీరికి అఖిల్ జన్మించాడు.

కాగా....ఇటీవల అమలకు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ‘మీకు నాగ చైతన్య తల్లిస్థానం ఇస్తాడా?' అనే ప్రశ్నకు అమల తనదైన రీతిలో స్పందించారు. అతనికి తల్లి ఉన్నపుడు నేను ఆ స్థానాన్ని ఆశించడం తప్పు. నేను ఆమె స్థానాన్ని లాక్కోలేను అంటూ సమాధానం ఇచ్చారు. నాగ చైతన్య లాగే నాకు స్టెప్ మదర్(సవతి తల్లి) ఉంది, నేను ఎప్పుడూ ఆమెను తల్లిగా అంగీకరించలేదు, ఆమె కూడా నా స్థానాన్ని లాక్కోవడానికి ప్రయత్నించలేదు అన్నారు అమల.

Amala Akkineni about Naga Chaitanya

నాగ చైతన్య సినిమాల విషయానికొస్తే...
ప్రస్తుతం నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత త్వరలో గౌతం మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా మరో సినిమా తెరకెక్కబోతోంది. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం ఈ చిత్రంలో తొలుత సమంతను అనుకున్నప్పటకీ ఆమెను కాకుండా మంజిమ మోహన్ అనే మళయాలం హీరోయిన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏమాయ చేసావే' సినిమా తర్వాత చైతన్య కెరీర్ ఒక్కసారిగా పుంజుకుంది. తాజాగా మరోసారి నాగ చైతన్య అతని దర్శకత్వంలో చేస్తుండటం హాట్ టాపిక్ అయింది. మంజిమ మోహన్ ఇప్పటికే పలు మళయాల చిత్రాల్లో నటించింది.

English summary
Amala Akkineni about her step son Naga Chaitanya.
Please Wait while comments are loading...