»   » తప్పుదారి పట్టించారు...చాలా బాధపడ్డా : అమలాపాల్

తప్పుదారి పట్టించారు...చాలా బాధపడ్డా : అమలాపాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : కొన్నేళ్ల క్రితం నేను చేసిన ఓ పాత్ర కాస్త వివాదాస్పదమైంది. కానీ నటనకు అవకాశం ఉన్నది కావడంతో ధైర్యం చేసి నటించా. ఆ తరవాత వచ్చిన నా సినిమాలు విజయం సాధించి, మంచి పేరొచ్చింది. అదే అవకాశం అనుకొని ఆ సినిమాను మళ్లీ విడుదల చేశారు. ప్రేక్షకులను తప్పుదారి పట్టించేలా ప్రచార చిత్రాలూ, వాల్‌పోస్టర్లలో నన్ను చూపించే ప్రయత్నం చేశారు. అదంతా చూసి చాలా బాధపడ్డా. అప్పుడర్థమైంది సినిమాలకు డబ్బే ప్రధానమనీ, నటులు అన్ని రకాల సందర్భాలనూ ఎదుర్కోవడానికి సిద్ధపడాలనీ అంటూ చెప్పుకొచ్చింది అమలాపాల్.

అలాగే అభిమానులు గురించి చెప్తూ....షూటింగ్‌లో భాగంగా చాలా ప్రాంతాలకు వెళ్లాను. ఎందరో అభిమానుల్ని కలిశాను. వాళ్లలో ఒకరు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతారు. నేను ఓసారి షూటింగ్‌ కోసం చాలారోజులు అమెరికాలో ఉండిపోయాను. అప్పటికే నన్ను కలిసి అభినందిద్దామని అనుకున్న ఓ అభిమాని, నేను తిరిగి రావడం ఆలస్యం అవుతుందని తెలిసి నేరుగా అమెరికాకు వచ్చేశాడు. నాతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయాడు. తరవాత ఇంకెప్పుడూ కనిపించలేదు. నిజమైన అభిమానమంటే అతనిదే అనిపించింది. ఎంతో మంది నన్ను అభిమానిస్తే నేను అభిమానించే మొదటి వ్యక్తి అతనే అని చెప్పాలి అని అందామె.

తను డబ్బింగ్ చెప్పుకోవటం గురించి చెప్తూ....ఏ భాషలో నటించినా నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకోవాలనుకుంటా. మలయాళం మాతృభాష సరే! తమిళంలో ఈ మధ్యే మొదటిసారి నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకున్నా. తెలుగు మాట్లాడటమూ సాధన చేస్తున్నా. కొంచెం కొంచెం మాట్లాడగలుగుతున్నా అంది.

ఇద్దరమ్మాయిలతో మంచి జోష్ మీద ఉన్న అమలా పాల్ కు త్రిష వైపు నుంచి ట్విస్ట్ ఎదురైంది. సూర్యకు 'కాక్కా కాక్కా', 'సూర్య సన్నాఫ్ ఆఫ్ కృష్ణన్'లాంటి అద్భుత విజయాల్ని అందించిన దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ప్రస్తుతం 'ధ్రువనక్షత్రం' తెరకెక్కించనున్నాడు. నటీనటుల ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో సూర్యకు జంటగా అమలాపాల్‌ పేరును పరిశీలించారు. ప్రస్తుత తనస్థాయి ఆధారంగా అవకాశం దక్కుతుందని అమలాపాల్‌ కూడా ఆశలు పెంచుకుంది.

English summary

 Amala Paul happy to work with Goutham Menon. She Says that her telugu films are super hit and she wants to settle in Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X