»   » మీడియాతో అమలాపాల్ మాంగారు, కొన్ని రివీల్ చేస్తూ..,తిట్టిపోసాడు

మీడియాతో అమలాపాల్ మాంగారు, కొన్ని రివీల్ చేస్తూ..,తిట్టిపోసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొత్తానికి అమలాపాల్ తన భర్త విజయ్‌తో విడాకులు తీసుకుందనే వార్త నిజమని తేలింది. గత కొన్నాళ్ళుగా వీరిద్దరి విడాకులకు సంబంధించి కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై విజయ్ తండ్రి ఏ.ఎల్ అళగప్పన్ స్వయంగా విజయ్, అమలాపాల్ వీడిపోయారని ప్రకటించారు. ఈ విషయమై ఆయన తమిళ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు.

రీసెంట్ గా మీడియాతో ఎల్ అళగప్పన్ మాట్లాడుతూ...అమలాపాల్ ని దారుణంగా తిట్టిపోసినంత పని చేసినంత పనిచేసాడని తెలుస్తోంది. ఆయన చెప్పేదాని ప్రకారం...ఇంట్లో పెద్దలెవరకి కానీ, ఆమె తన భర్త విజయ్ కు కానీ ఆమె గౌరవం ఇవ్వలేదు. దాంతో ఆమె భర్త కానీ, అత్తామామలు కానీ ఆమె విషయంలో సంతోషంగా లేరు. ఆమె యాక్టివ్ గా సినిమాల్లో నటించటం, ముఖ్యంగా కోలివుడ్ లో నటించటం అసలు ఇష్టంలేదని చెప్తున్నా ఆమె వినలేదట.

కేవలం ఫ్యామిలీ లైఫ్ పైనే కాన్సర్టేట్ చేయమని విజయ్ కోరినా, అమలా పాల్ పట్టించుకోలేదు. తాను సినిమాలు వదలలేనని తేల్చి చెప్పటమే కారణం అంటున్నారు. అయితే అసలు కారణం వేరని, డిల్లీ లోని ఓ ఫ్యాషన్ డిజైనర్ ఆమె రిలేషనే కారణమని మరోవైపు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..

మాట తప్పింది

మాట తప్పింది

పెళ్లికు ముందు ఆమె ఇక సినిమాలకు స్వస్ది చెప్పి గృహిణిగా నడుచుకుంటానని మాట ఇచ్చి తప్పిందట.

ధనుష్ కోసం

ధనుష్ కోసం

ధనుష్ హీరోగా వస్తున్న వడ చెన్నై చిత్రంలో మొదట సమంతను అనుకున్నారు. కాని సమంత వివాహం గురించి నో చెప్పటంలో అమలాపాల్ సీన్ లోకి వచ్చింది.

మూడేళ్లు

మూడేళ్లు

ఈ సినిమా కోసం మూడేళ్లు కాల్షీట్ లను అమలా పాల్ ఇవ్వటం విజయ్ కు షాక్ కలిగించిందని సమాచారం.

సొంత తల్లితండ్రులు

సొంత తల్లితండ్రులు

అమలా పాల్ తన సొంత తల్లి తండ్రుల మాట కూడా వినటానికి ఇష్టపడం లేదని అలగప్పన్ అన్నారు.

అవన్నీ అనవసరం

అవన్నీ అనవసరం

తనకు వారు డైవర్స్ తీసుకుంటారా లేక అలాగే కంటిన్యూ అవుతారా అనేది ముఖ్యం కాదని, తనకు తన కుమారుడు సంతోషంగా ప్రశాంతంగా బ్రతకటమే ముఖ్యం అని తేల్చి చెప్పారు.

అటు వైపు నుంచి

అటు వైపు నుంచి

అమలాపాల్ తల్లి తండ్రుల వైపు నుంచి వాళ్ల ఆలోచన ఏమిటి..వారు స్టాండ్ ఏమిటి అనేది ఇప్పటివరకూ ఓపెన్ కాలేదు

నిర్లక్ష్యం

నిర్లక్ష్యం

తన కుటుంబాన్ని కోడలిగా అమలాపాల్ పట్టించుకోకపోవటం,నిర్లక్ష్యంగా ఉండటం విజయ్ సహించలేకపోయారని తెలుస్తోంది.

లైఫ్ స్టైల్స్

లైఫ్ స్టైల్స్

వారిద్దరివి విబిన్నమైన లైఫ్ స్టైల్స్ కావటం కూడా వీరి వైవాహిక జీవితాన్ని దెబ్బ కొట్టిందని తెలుస్తోంది.

నటుడుతో ..

నటుడుతో ..

అమలా పాల్ కాపురం కూలటానికి కారణం తమిళంలోని పెళ్లైన ఓ యంగ్ హీరో అని చెప్తున్నారు. అతనితో ఆమె ఓవర్ ఫ్రెండ్లీగా ఉండటం విజయ్ సహించలేకపోయాడని చెప్తున్నారు

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో అమలా పాల్ డైవర్స్ వార్త హాట్ టాపిక్ గా రన్ అవుతోంది. అక్కడ నుంచే కొన్ని రూమర్స్ సైతం పుడుతున్నాయి

కెరీర్ ప్రారంభంలో ...

కెరీర్ ప్రారంభంలో ...

ఓ బి-గ్రేడ్ సినిమాతో తమిళ తెరకు పరిచయమైన అమలపాల్.

ఆ తర్వాత....

ఆ తర్వాత....

‘ప్రేమఖైదీ' పేరుతో తెలుగులో అనువాదమైన సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది.

అనంతరం

అనంతరం

విజయ్ తీసిన ‘నాన్న' సినిమాలో నటించినపుడు ఆమె అతడికి చేరువైంది.

కాంబినేషన్

కాంబినేషన్

ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘తలైవా' సినిమా కూడా వచ్చింది. అప్పుడే వాళ్లిద్దరి బంధం బలపడింది.

వివాహం, విడాకులు

వివాహం, విడాకులు

2014లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే వీళ్లిద్దరూ విడిపోవడం విచారం కలిగించే విషయం.

రూమర్స్ నిజమయ్యాయి

రూమర్స్ నిజమయ్యాయి

రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రెటీ జంట ఎ.ఎల్.విజయ్-అమలా పాల్ విడిపోవడం ఖాయమని తేలిపోయింది. స్వయంగా విజయ్ తండ్రి ఎ.ఎల్.అళగప్పనే ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.

పక్కా అని తేలిపోయింది

పక్కా అని తేలిపోయింది

ఓ మీడియా ఇంటర్వ్యూ సందర్భంగా అమలాపాల్ ప్రస్తావన అనవసరమని విజయ్ అనడంతో అమలాకు అతను దూరమైన సంగతి పక్కా అని స్పష్టమైంది.

అలాగే..

అలాగే..

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తన తల్లిదండ్రులు ఎలా చెబితే అలా నడుచుకుంటానని విజయ్ అన్నాడు.

ఇష్టం లేకుండా..

ఇష్టం లేకుండా..

విజయ్ మాటల్ని బట్టి...తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా అమలను పెళ్లి చేసుకున్నాడేమో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

English summary
Vijay wanted his wife to concentrate more on family life, but the actress was not ready for it. The couple once had a heated argument over the issue, and Amala Paul even agreed to lessen the number of films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu