»   »  అల్లుడితో అమలాపాల్ రిలేషన్, సూపర్ స్టార్ స్వయంగా వార్నింగ్, అందుకే ఈ నిర్ణయం

అల్లుడితో అమలాపాల్ రిలేషన్, సూపర్ స్టార్ స్వయంగా వార్నింగ్, అందుకే ఈ నిర్ణయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు విజయ్‌ల ప్రేమ పెళ్లి పెటాకులై, వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో వీరి విడాకులకు కారణాలు అంటూ, ఆమె పై అనఫీషియల్ బ్యాన్ నడుస్తోందంటూ.. రకరకాల వార్తలు మీడియాలో వస్తున్నాయి.

అయితే తాజాగా ఓ విషయం బయిటకు వచ్చి,తమిళ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. అమలా పాల్ పై అనధికార బ్యాన్ ని ఓ తమిళ సూపర్ స్టార్ పెట్టారని మళయాళ సిని పరిశ్రమలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అందుతున్న సినీ వర్గాల సమాచారం ప్రకారం, అమలా పాల్ కెరీర్ పరంగా వెనక్కి నెట్టే ప్రయత్నాలు జరుగటానికి కారణం ఆయనేట.

అమలాపాల్ డైవర్స్: నోరు విప్పిన భర్త, తేల్చి చెప్పిన షాకింగ్ నిజాలు

తమిళ నాట హీరో అయిన తన అల్లుడుతో ఆమె రిలేషన్ పెట్టుకుందని, తన కుమార్తె కాపురం కూలిపోయే స్దితికి వచ్చి భయంతోనే సూపర్ స్టార్ ఈ బ్యాన్ వ్యూహం అనుసరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆమెను వదిలేయమని ఇప్పటికే తన అల్లుడుకి చెప్పి, వార్నింగ్ ఇచ్చాడని, అయినా అతను వినటం లేదని, దాంతో అమలా పాల్ వైపు నుంచి నరుక్కురావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అమలాపాల్ కు టార్చర్, మామగారు చెప్పినవన్నీ అన్ని అబద్దాలే

అమలాపాల్ కు అవకాశాలు ఇస్తే సూపర్ స్టార్ తో తగువుపెట్టుకున్నట్లే అని భావించి ఆమెను దూరం పెట్టాలని సీనియర్ నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలు కలిసి నిర్ణయం తీసుకున్నట్లు వార్త. ఈ నేపధ్యంలో ఇప్పటికే కమిటైన ధనుష్ చిత్రం వడ చెన్నైలో మాత్రం ఆమె కొనసాగుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. వడై చెన్నై నుంచి ఆమె బయిటకు వచ్చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో...

మామగారి పాత్ర

మామగారి పాత్ర

గత కొద్ది రోజులుగా..అమలాపాల్ పై అనఫీషియల్ గా బ్యాన్ పెట్టాలనే నిర్ణయం వెనక ఎల్ విజయ్ తండ్రి ఎల్. అలగప్పన్ ఉన్నట్లు ఇన్నాళ్లూ చెప్పుకుంటున్నారు.

అంతా షాక్

అంతా షాక్

అలగప్పన్ ఓ పేరున్న నిర్మాత, నటడు, తమిళ సినిమా ఇండస్ట్రీ నిర్మాతలతో మంచి స్నేహ భాంధవ్యాలు ఉన్నవాడు కావటంతో ఇది జరుగుతోందంటున్నారు. కానీ అసలు నిజం అది కాదని, ఆయనకు ఈ బ్యాన్ కు సంభంధం లేదని, తమిళనాడులోని ఓ సూపర్ స్ట్రార్ ఈ బ్యాన్ వెనక ఉన్నట్లు ఇప్పుడు వార్తలు రావటంతో అంతా షాక్ అవుతున్నారు.

మరో ప్రక్క..

మరో ప్రక్క..

పా రంజిత్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘కబాలి'. ఈ చిత్రం దర్శకుడుతో మరో చిత్రం సిద్ధమవుతోంది. ఈ సినిమాని తలైవా అల్లుడు, నటుడు ధనుష్‌ తన వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు ఇటీవల వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో అమలా పాల్‌ నటించనున్నట్లు సమాచారం.

దాంతో

దాంతో

ఒక్కసారిగా కబాలి దర్శకుడుతో తలైవా పక్కన అమలా పాల్‌ నటించబోతోందని వార్తలు రావటంతో చెన్నై చెవులు కొరుక్కుంటోంది. రెండింటికి ముడి వేసే ప్రయత్నం చేస్తోంది.

ప్రస్తుతం ...

ప్రస్తుతం ...

అమలా పాల్‌ వెట్రిమారన్‌ తెరకెక్కిస్తున్న ‘వడా చెన్నై' సినిమాలో ధనుష్‌, విజయ్‌సేతుపతి, ఆండ్రియా జెరీమియాలతో కలిసి నటిస్తున్న విషయం డైలమోలో పడింది

ధనుష్ చిత్రాలే

ధనుష్ చిత్రాలే

ధనుష్ నిర్మించే చిత్రంలోనూ, ధనుష్ హీరోగా చేసే చిత్రంలోనూ అమలాపాల్ నటించటం పట్ల ఈ రూమర్స్ కు బలం చేకూర్చినట్లైంది

పరస్పర అంగీకారం

పరస్పర అంగీకారం

పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటున్న వీరు తమకు విడాకులు మంజూరు చేయాలని చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. అభిప్రాయభేదాల కారణంగా చాలా రోజులుగా విడివిడిగా ఉంటున్న ఈ ఇద్దరు తాజాగా పరస్పర అంగీకారం మీద విడాకులకు అప్లై చేసుకున్నారు.

ఇష్టపటడటం లేదు

ఇష్టపటడటం లేదు

ఇక ఈ విషయమై అమలా పాల్ మాత్రం మీడియా ముందుకు రావటానికి ఇష్టపడటం లేదు. దర్శకుడు ఎల్ విజయ్ సైతంమీడియాకు అందుబాటులో లేరు. ఈ విషయమై స్పందించేందుకు. వీరిద్దరిలో ఎవరో ఒకరు మాట్లాడితే తప్ప ఇందులో నిజా నిజాలు ఎంత అనేది మాత్రం తెలియదు.

తెలుగువారికి

తెలుగువారికి

‘బెజవాడ', ‘నాయక్‌', ‘ఇద్దరమ్మాయిలతో' సినిమాల ద్వారా తెలుగువారికి సుపరిచితురాలయ్యారు హీరోయిన్ అమలాపాల్‌.

పూర్తి స్వేచ్చ

పూర్తి స్వేచ్చ

తన భర్త విజయ్‌ నటించడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని కూడా అమలాపాల్ గతంలో పలుమార్లు ప్రస్తావించారు. కొంతకాలంగా వీరిరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది. వీరిద్దరు విడిపోయారని పలు పత్రికలు కూడా ఇటీవల వార్తలు రాస్తూ పలు కారణాలను ప్రస్తావించాయి.

అప్పడే..

అప్పడే..

2014లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే వీళ్లిద్దరూ విడిపోవడం విచారం కలిగించే విషయం.

కుటుంబంపై నింద

కుటుంబంపై నింద

ముఖ్యంగా విజయ్ కుటుంబం ఈ విషయంతో మీడియాలోనూ, అబిమానులతోనూ విమర్శలు పాలు అవుతోంది. కావాలనే కుటుంబం ఆమెను దూరం పెడుతోందని, ఆమె కెరీర్ ఆశలు అత్త, మామలు చంపేసే ప్రయత్నం చేసారని, వాళ్లని విలన్స్ గా క్రియేట్ చేస్తూ కథనాలు వెలువడుతున్నాయి.

English summary
According to the grapevine, a Kollywood superstar, who is extremely irked with Amala Paul's overfriendliness with his son-in-law, a leading hero of the industry, is the mastermind behind the ban.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu