»   » ఫోన్ చేసి గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు.. వాళ్లను నమ్మి కోట్లు పోగొట్టుకొన్నా.. ఆమని

ఫోన్ చేసి గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు.. వాళ్లను నమ్మి కోట్లు పోగొట్టుకొన్నా.. ఆమని

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Actress Aamani Re Entry With IPC Section Bharya Bandhu Movie

  కుటుంబ కథా చిత్రాలతో అలరిస్తూ సినీ నటి ఆమని బాపు బొమ్మగా పేరు తెచ్చుకొన్నారు. స్వర్గీయ బాపు దర్వకత్వంలో మిస్టర్ పెళ్లాం తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువయ్యారు. కృష్ణ, నాగార్జున, బాలకృష్ణ, జగపతిబాబు లాంటి స్టార్ హీరోలతో డ్యూయెట్లు పాడేసుకొన్నారు. కెరీర్ ఉన్నతస్థాయిలో ఉండగానే ప్రేమ పెళ్లి చేసుకొని సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ భార్యబంధుతోపాటు మరికొన్ని చిత్రాల్లో విభిన్న పాత్రలతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకొన్నారు.

  అలా మాట్లాడితే నమ్మేస్తాను

  అలా మాట్లాడితే నమ్మేస్తాను

  నాతో ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే వాళ్లను నమ్మేస్తాను. దానిని కొందరు అదునుగా తీసుకొన్నారు. అలా కొందర్ని నమ్మి కోట్లు పోగొట్టుకున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమకు మరోసారి పరిచయం కావడం సంతోషంగా ఉంది. హీరోయిన్‌గా ఉన్నప్పుడు కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది అని తెలిపారు.

  క్యాస్టింగ్ కౌచ్‌పై సెన్సేషనల్

  క్యాస్టింగ్ కౌచ్‌పై సెన్సేషనల్

  వేషాల కోసం పడకగదిలోకి (క్యాస్టింగ్ కౌచ్) అంశంపై ఆమని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కెరీర్ ఆరంభంలో కొత్త ప్రొడక్షన్ ఆఫీసుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవి. సాధారణంగా నేను నా తల్లితో కలిసి ఆడిషన్స్ వెళ్లే దానిని. అయితే వాళ్లు ఫోన్ చేసి నా తల్లిని వెంటపెట్టుకోకుండా గెస్ట్ హౌస్‌కు రమ్మని చెప్పేవారు అని ఆమని తెలిపారు.

  చాలాసార్లు అలాంటి ఫోన్ కాల్స్

  చాలాసార్లు అలాంటి ఫోన్ కాల్స్

  ఏదో దురుద్దేశంతో ఫోన్ కాల్స్ చేసేవారిని వెంటనే గుర్తు పట్టేదానిని. దాంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అలాంటి ముప్పులో చిక్కుకోలేదు. చాలాసార్లు ఇలాంటి ఫోన్స్ కాల్స్ బారిన పడ్డాను అని ఆమని తెలిపారు. వెండి తెర మీద నేను అందంగా కనిపించకపోవడం, అందగత్తెను కాకపోవడంతో అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు అని అమని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

   ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి

  ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి

  నేను నటించిన చిత్రాల కారణంగా నాకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన ఉండేది. ఎస్వీ కృష్ణారెడ్డి, బాపు లాంటి సీనియర్ డైరెక్టర్లు నన్న చక్కగా చూసుకొనే వారు. కొత్త నిర్మాతల తోనే క్యాస్టింగ్ కౌచ్ లాంటి సమస్యలు వచ్చేవి అని ఆమని వెల్లడించారు.

  English summary
  Senior Actress Aamani made re entry with IPC section Bharya Bandhu. Aamani said that she never faced casting couch trouble from reputed and senior directors. She said that once she got offers in SV Krishna Reddy, Bapu films there was no looking back for her. She clarified that she faced casting couch issues majorly from the new producers.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more