»   » మెగాస్టార్ తో సీ.ఎం. సతీమణి డాన్స్... ఈ ఫోటో చూడండి

మెగాస్టార్ తో సీ.ఎం. సతీమణి డాన్స్... ఈ ఫోటో చూడండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్నాళ్ళ క్రితం ఓ వ్యక్తి బాలీవుడ్‌ సినిమాలో గాయనిగా పరిచయమయ్యారు! అందుకు ఆమె పారితోషికమూ తీసుకోలేదు! ఆమె మరెవరో కాదు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సతీమణి అమృతా ఫడ్నవీస్‌. ప్రియాంకా చోప్రా కథానాయికగా ప్రకాశ్‌ ఝా తెరకెక్కిస్తున్న 'జై గంగాజల్‌' సినిమాలో అమృత ఓ భక్తి పాట పాడారు. ఈ పాటకు గానీ, ఇతర పాటలకు గానీ ఎలాంటి పారితోషకమూ తీసుకోలేదు కూడా. తొలిసారిగా సినిమాలో పాడడం ఓ గొప్ప అనుభూతిని ఇచ్చిందని. సలీం-సులేమాన్‌ ఇచ్చిన సంగీతం, మనోజ్‌ ముంతాషిర్‌ రచించిన గీతాలు ఎంతో బాగున్నాయని మెచ్చుకున్న అమృత. తాను పాడడం పట్ల తన భర్త, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆనందం వ్యక్తం చేశారని చెప్పగానే ఏదో మామూలుగా చేంజ్ కోసం పదిందిలే అనుకున్నారంతా... కనీ ఆమె ఇప్పుడు ఫ్రొఫెషనల్ సింగర్ గా స్థిరపడాలనుకుంటున్నారేమో అనే అనుమానం కొత్తగా అందరిలోనూ కలుగుతోంది...

Amitabh Bachchan to appear in a music video with Maharashtra CM Devendra Fadnavis' wife

'ఫిర్‌సే', 'జై గంగాజల్‌' వంటి సినిమాల్లో అమృత పాటలు పాడింది. ఇప్పుడు ఏకంగా తెరపై గ్లామరస్‌గా మెరవడానికి సిద్ధమైపోతోంది.కునాల్ కోహ్లీ తీసిన ఫిర్ సే.. ప్రకాష్ ఝా మూవీ జై గంగాజల్ కోసం గాత్రదానం చేసిన అమృత.. ఇప్పుడు యాక్టింగ్ కూడా మొదలుపెట్టేసింది. అదికూడా ఏకంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి డ్యాన్సులు వేసే రేంజ్ అన్నమాట. 'ఫిర్ సే' అంటూ సాగే ఓ మ్యూజిక్ వీడియో కోసం షూటింగ్ చేయగా.. ఇందులో మిసెస్ ఫడ్నవీస్ గ్లామర్ రూపం చూపించడం విశేషం. మోకాళ్ల పైకి వేసిన రెడ్ కలర్ ఫ్రాక్.. హైహీల్స్ తో మెరిసిపోతోంది అమృత.

ఆర్ట్స్ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయేందుకు అమృత రాగా.. ఆ ఇనిస్టిట్యూట్ హెడ్ గా అమితాబ్ కనిపించనున్నారు. ఇద్దరి మధ్య సంభాషణలో భాగంగా ఈ పాట వస్తుంది అని చెబుతున్నాడు దర్శకుడు అహ్మద్ ఖాన్. సీఎం భార్య ఇలాంటి గ్లామర్ రూపంలో బాలీవుడ్ గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెడుతుండడం ఆశ్చర్యకరమే. మ్యూజిక్‌ దిగ్గజం 'టి-సిరీస్‌' ప్రతీ ఏడాది బిగ్‌ బడ్జెట్‌ మ్యూజిక్‌ వీడియోస్‌ను రూపొందిస్తుంటుంది. హృతిక్‌ రోషన్‌, సోనమ్‌ కపూర్‌ వంటి బాలీవుడ్‌ స్టార్లను కూడా తమ మ్యూజిక్‌ వీడియోల్లో నటింపజేస్తుంది. ఇప్పుడు ఆ సంస్థ 'ఫిర్‌సే' పేరుతో చేస్తున్న మ్యూజిక్‌ వీడియోలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి అమృత ఆ వీడియోలో చిందేస్తోంది. మొత్తానికి ఓ సీఎం భార్య అయ్యుండి ఇలా గ్లామరస్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకోవడం విశేషమే.

English summary
Maharashtra Chief Minister Devendra Fadnavis's wife singer Amruta Fadnavis is all set to make her debut on the screen in the music video of a song sung by her. She will share the screen space with none other than the megastar Amitabh Bachchan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu