»   » బాలయ్యకు మెగాస్టార్ షాక్ అంటూ వార్తలు... అసలు సంగతి ఇదీ!

బాలయ్యకు మెగాస్టార్ షాక్ అంటూ వార్తలు... అసలు సంగతి ఇదీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ-కృష్ణవంశీ కాంబినేషన్ కొన్ని రోజుల క్రితం 'రైతు' సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అత్యంత కీలకమైన అతిథి పాత్ర బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తో చేయించాలనుకున్నారు.

బాలయ్య 101వ సినిమాగా 'రైతు' మొదలవ్వాల్సి ఉన్నా....అమితాబ్ డేట్స్ దొరక్క పోవడం వల్లనే సినిమా ముందుకు సాగడం లేదనే వాదన ఉంది. దీంతో బాలయ్య తన 101వ సినిమాను పూరితో కమిట్ అయ్యాడు.

బాలయ్యకు మెగాస్టార్ షాక్

బాలయ్యకు మెగాస్టార్ షాక్

ఇదిలా ఉంటే బాలయ్యకు మెగాస్టార్ షాక్ అంటూ తాజాగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అందుకు కారణం అమితాబ్ బచ్చన్ మళయాలంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కే సినిమాకు డేట్స్ ఇవ్వడమే.

అందుకే ఈ ప్రచారం

అందుకే ఈ ప్రచారం

అయితే బాలయ్య సినిమాకు డేట్స్ ఇవ్వని అమితాబ్... మోహన్ లాల్ మూవీకి ఇవ్వడంపై నెగెటివ్ గా ప్రచారం మొదలైంది. అప్పుడు బాలయ్య మూవీకి అమితాబ్ డేట్స్ ఎందుకు ఇవ్వలేదు? ఇపుడు మోహన్ లాల్ సినిమాకు ఎందుకు ఇచ్చారు? బాలయ్య అంటే చిన్న చూపా? అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

సవాలక్ష కారణాలుంటాయి

సవాలక్ష కారణాలుంటాయి

ఒక సినిమాకు డేట్స్ ఇవ్వడం, ఇవ్వక పోవడం వెనక సవాలక్ష కారణాలు ఉంటాయి. వీళ్ల డేట్స్ ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ల సినిమా మొదలు కాక పోవడం, సినిమా మొదలు పెడదామనుకునే సమయానికి అమితాబ్ లాంటి వాళ్ల డేట్స్ ఖాళీగా ఉండక పోవడం ఇలా చాలా ఉంటాయి.

కావాలని ఎవరూ చేయరు

కావాలని ఎవరూ చేయరు

అమితాబ్ లాంటి వారు కావాలని డేట్స్ ఇవ్వక పోవడం లాంటివి ఏమీ ఉండదని, పరిస్థితులు అనుకూలించక పోవడం లాంటి వల్లనే ఇలాంటివి జరుగుతాయని, దీనిపై అనవసరమైన రాద్దాంతం అవసరం లేదని అంటున్నారు సినీ రంగానికి చెందిన వారు.

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రాండమూఝం

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రాండమూఝం

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రాండమూఝం పేరుతో తెరకెక్కనున్న మలయాళ సినిమాకి అమితాబ్ ఓకే చెప్పేశారు. ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.

భీష్ముడి తరహా పాత్రలో బిగ్ బి

భీష్ముడి తరహా పాత్రలో బిగ్ బి

రాండమూఝం మూవీలో బిగ్ బీ భీష్ముడి తరహా పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. మోహన్ లాల్ ఇందులో భీముడిగా కనిపించబోతున్నారట. జ్ఞాన్ పీఠ అవార్డు గ్రహీత ఎం.టి.వాసుదేవన్ నాయర్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది

English summary
Discussions are on with actor Amitabh Bachchan to rope him in for the role of Bheeshma in the multi-lingual film Randamoozham, based on Jnanpith award winner M.T. Vasudevan Nair’s novel. Malayalam actor Mohanlal has been cast as ‘Bhima’, the lead character in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu