»   » రజనీ ‘కొచ్చాడయాన్’ ఆడియో వేడకకు చీఫ్ గెస్ట్ ఎవరంటే?

రజనీ ‘కొచ్చాడయాన్’ ఆడియో వేడకకు చీఫ్ గెస్ట్ ఎవరంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'కొచ్చాడయాన్' చిత్రం ఆడియో విడుదలకు రంగం సిద్ధమైంది. మార్చి 9వ తేదీన జరిగే తమిళ వెర్షన్ కొచ్చాడయాన్ ఆడియో ఆవిష్కరణ వేడుకకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారు.

రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్ నటిస్తున్న ఆడియో ఫంక్షన్ అంటే ఆయన స్థాయికి సరితూగే గెస్ట్ హాజరు కావాల్సిందే. అందుకు సరైన వ్యక్తి బిగ్ బి. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ మంచి స్నేహితులు. ఇటు సౌతిండియా సినిమా పరిశ్రమలో....అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎవరికి వారే సాటి. అమితాబ్‌తో పాటు అనేక మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.

Amitabh Bachchan, The Chief Guest Of Rajinikanth's Kochadaiiyaan Music Launch

ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ తమిళ సినీ పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రెహమాన్ రేంజికి తగిన విధంగా ఆడియో వేడుక ఫుల్ స్వింగ్‌లో జరిపేందుకు ప్లాన్ చేసారు. ఈ వేడుకలో ఆయన లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.

కొచ్చాడయాన్ చిత్రానికి రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. జాకీష్రాఫ్, శరత్ కుమార్, శోభన, ఆది, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తమిళంతో పాటు, తెలుగు, హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించారు. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది.

English summary
The stage is getting set for the audio launch function of Rajinikanth magnum opus Kochadaiiyaan. The makers of the film are leaving no stone unturned to make it the talk of the town. Hence, they have now invited Amitabh Bachchan to launch the music of the superstar's flick.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu