»   » ‘బాహుబలి’పై అమితాబ్ కామెంట్స్ , షాకయ్యామన్న రాజమౌళి

‘బాహుబలి’పై అమితాబ్ కామెంట్స్ , షాకయ్యామన్న రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ ప్రముఖుడు, బిగ్ బి అమితాబ్ ‘బాహుబలి' చిత్రంపై ప్రశంసలు గుప్పించడంపై దర్శకుడు రాజమౌళి ఆనందం వ్యక్తం చేసాడు. ఆయనకు థాంక్స్ చెప్పారు. అమితాబ్ బచ్చన్‌జీకి పెద్ద థాంక్స్. ఆయన నుండి అలాంటి పొగడ్తలు వినడంతో బాహుబలి టీం ఇంకా షాక్‌లో ఉంది. మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసే విధంగా ఆయన మాట్లాడారు అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

అమితాబ్ ఏమన్నారంటే...


‘బాహుబలి' తెలుగు సినిమా ఏమాత్రం కాదు, ఇది ప్రపంచ స్థాయి సినిమా అని అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి విజువల్స్ తానెపుడూ చూడలేదని, ఇలాంటి సినిమాలో తనకు అవకాశం రాకపోవడం చాలా బాధగా ఉందని అన్నారు. ఈ సినిమాను భారత ప్రజలందరూ చూసి ఎంజాయ్ చేయాలని కూడా సూచించారు. అమితాబ్ మాట్లాడిన వీడియో ఇక్కడ చూడొచ్చు.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి' విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవల విడుదలై ట్రైలర్ ‘బాహుబలి' సినిమాపై అంచనాలు అమాంతం పెరిగేలా చేసాయి. ఆడియో వేడుక కనీ విని ఎరుగని రీతిలో గ్రాండ్‌గా జరిగింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధికంగా బడ్జెట్ రూ. 250 కోట్లు ఖర్చు పెట్టి రెండు భాగాలుగా తీస్తున్న ఈ సినిమాపై యావత్ భారతీయ సినీ ప్రేక్షక లోకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.


హిందీలో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది. కరణ్ జోహార్ కోరిక మేరకు ప్రభాస్, రానా, తమన్నా ముంబైలో ఇప్పటికే తమ పని మొదలు పెట్టారు. ప్రస్తుతం అక్కడ సినిమా ప్రచారం నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు.


Amitabh Bachchan On Baahubali

జులై 10వ తేదీన బాహుబలి సినిమా ప్రపంచ వ్యప్తంగా తెలుగు, తమిళం, హిందీ మళయాలంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా ఎక్కవ మంది ప్రేక్షకులు రీచ్ కావడానికి విదేశాల్లో ఆయా భాషల్లో విడుదలువున్న ఈ చిత్రాన్ని సబ్ టైటిల్స్ అటాచ్ చేసి విడుదల చేస్తున్నారు.

English summary
During a video chat with ‘Baahubali’ actor Rana Daggubati, the legendary Amitabh Bachchan shared his thoughts on the film and said that he's simply amazed and astonished to see such magnificent visuals.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu