»   » కలాం జీవిత చరిత్ర సినిమాగా ...డిటేల్స్

కలాం జీవిత చరిత్ర సినిమాగా ...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: బాలీవుడ్‌ దర్శకులు నీలా మాధవ్‌ పాండా తెరకెక్కించిన చిత్రం 'ఐ యామ్‌ కలాం'. పలు అవార్డులు, ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. ఆయనే ఇప్పుడు కలాం జీవితం ఆధారంగా మరో చిత్రం తెరకెక్కించనున్నారు. 'కలాం' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ కలాం పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

ఈ విషయంపై మీడియాతో చర్చిస్తూ త్వరలోనే చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కలాం పాత్ర పోషించగల వ్యక్తి అమితాబ్‌ మాత్రమేనని, దేశమంతటా ఎందరో అభిమానులున్న ఆయన ఈ పాత్రలో చక్కగా ఇమిడిపోగలరని పాండా తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక రీసెంట్ గా...

Amitabh Bachchan to play Dr kalam?

బాలీవుడ్ ప్రముఖుడు, బిగ్ బి అమితాబ్ ‘బాహుబలి' చిత్రంపై ప్రశంసలు గుప్పించడంపై దర్శకుడు రాజమౌళి ఆనందం వ్యక్తం చేసాడు. ఆయనకు థాంక్స్ చెప్పారు. అమితాబ్ బచ్చన్‌జీకి పెద్ద థాంక్స్. ఆయన నుండి అలాంటి పొగడ్తలు వినడంతో బాహుబలి టీం ఇంకా షాక్‌లో ఉంది. మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసే విధంగా ఆయన మాట్లాడారు అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

అమితాబ్ ఏమన్నారంటే... ‘బాహుబలి' తెలుగు సినిమా ఏమాత్రం కాదు, ఇది ప్రపంచ స్థాయి సినిమా అని అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి విజువల్స్ తానెపుడూ చూడలేదని, ఇలాంటి సినిమాలో తనకు అవకాశం రాకపోవడం చాలా బాధగా ఉందని అన్నారు. ఈ సినిమాను భారత ప్రజలందరూ చూసి ఎంజాయ్ చేయాలని కూడా సూచించారు.

English summary
Director Nila Madhab Panda, who shot to fame with I Am Kalam, the National Award winning film which paid homage to the late former President, is all set to direct a biopic on the great educationist, thinker and visionary. ”The big question now is, who will play Dr Kalam? Only one name comes to his mind. Says Nila, “It has to be Mr Bachchan. Only he has the fan following, clout and gravitas to play a visionary like Dr Kalam.”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu